Search This Blog

Chodavaramnet Followers

Thursday, 10 January 2013

CHILDRENS FAVOURITE BISCUITS WITH BOOST - RECIPE MAKING IN TELUGU


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బూస్టీ టేస్టీ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బూస్టీ టేస్టీ బిస్కెట్స్ మీ సొంతం.

బూస్టీ టేస్టీ బిస్కెట్స్ కి కావలసిన పదార్ధాలు:

మైదా - 1/2 కేజీ 
డాల్డా - 150 గ్రా 
పంచదార - 1/4 కేజీ (మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి) 
బూస్ట్ - 50 గ్రా 
చిక్కటి పాలు - 1 1/2 కప్పు 
యాలకుల పొడి - 1 స్పూన్ 
ఉప్పు - 1 /4 స్పూన్ 
అమ్మోనియం కార్బోనేట్ - 1/2 స్పూన్ 
సోడా ఉప్పు - 1 /2 స్పూన్ 

బూస్టీ టేస్టీ బిస్కెట్స్ తయారు చేసే విధానం:

ముందుగా ఒక పాత్రలో డాల్డా, పంచదార పొడి, బూస్ట్ కలిపి క్రీమ్ లాగ చేసుకోవాలి. అందులో మైదా, పాలు, యాలకుల పొడి, అమ్మోనియం కార్బోనేట్, సోడా ఉప్పు మరియు ఉప్పు వేసి ముద్దలా కలిపి కాసేపు గాలి చొరబడకుండా మూత పెట్టి ఉంచాలి. 
తరువాత పిండిని చపాతీలా అరంగుళం మందంగా చేసి చాకుతో ముక్కలుగా కట్ చేసి నెయ్యి రాసిన ప్లాస్టిక్ ట్రేలో (ఓవెన్ ట్రే) ఉంచి 15 నిమిషాల పాటు 275 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద బేక్ చెయ్యాలి. ఓవెన్ లేక పోతే ఓవెన్ లేక పోతే కుక్కర్ లో కానీ, మూత ఉన్న మందపాటి పాత్రలో గానీ ఇసుక పోసి పొయ్యి మీద పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. 
కుక్కర్లో పెట్టినప్పుడు గ్యాస్ కెట్ తీసేయ్యాలి. ఇసుక బాగా వేడి అయిన తరువాత బిస్కెట్స్ ప్లేట్ పెట్టాలి. ప్లేట్ మందంగా, లోతుగా ఉండాలి. పది నిమిషాల తరువాత తీసి చూస్తే బూస్టీ టేస్టీ బిస్కెట్స్ రెడీ. అప్పటికీ ఇంకా సరిగా బేక్ కాలేదనుకుంటే మంట తీసేసి మరికాసేపు వేడి ఇసుక మీద ఉంచితే సరిపోతుంది.