Search This Blog

Chodavaramnet Followers

Thursday, 10 January 2013

PREGNANT WOMEN / FUNCTION / FESTIVAL SPECIAL CHALIMIDI MAKING IN TELUGU


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం నేతి చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే నేతి చలిమిడి మీ సొంతం.

నేతి చలిమిడి కి కావలసిన పదార్ధాలు:

శ్రీరామనవమి స్పెషల్ వంటకము 
బియ్యం - 1/2 కేజీ 
నెయ్యి - 50 గ్రా 
బెల్లం - 350 గ్రా 
గసగసాలు - 2 స్పూన్స్ 
యాలకుల పొడి - 1/2 స్పూన్ 
ఎండు కొబ్బరి పొడి - 1/4 కప్పు 
వేయించిన పల్లీలు - కొద్దిగ 
జీడిపప్పు, ద్రాక్ష - కొన్ని 

నేతి చలిమిడి తయారు చేసే విధానం:

బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్ళలో ఒక రాత్రి మొత్తం నానపెట్టాలి. తరువాత ఆ బియ్యాన్ని కాసేపు నీడలో ఆరబెట్టి, గ్రైండర్‌లో వేసి మెత్తగా పిండి చేసి జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. 
ఇప్పుడు ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసి బెల్లాన్నిపాకం పట్టాలి. తీగ పాకం వచ్చిన తరువాత దించి అందులో కొద్ది కొద్దిగా పిండిని పోస్తూ బాగా కలియబెడుతూ పాకంలో పిండి బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. 
పిండి అంతా బాగా కలిసిన తరువాత అందులో నెయ్యి యాలకుల పొడి, కొబ్బరి పొడి, గసగసాలు, వేయించిన జీడిపప్పు, ద్రాక్ష, పల్లీలు వేసి మరోసారి బాగా కలపాలి. 
ఈ పిండి కొద్దిగా చల్లారిన తరువాత లడ్డు లాగా చేసుకుని ఆరిన తరువాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. అంతే నేతి చలిమిడి రెడీ.