Search This Blog

Chodavaramnet Followers

Thursday, 10 January 2013

ICE CREAM - THE FIRST CHOICE OF KIDS - MAKING IN TELUGU


ఐస్ క్రీమ్ కి కావలసిన పదార్ధాలు:

ఐస్‌క్రీమ్‌ పౌడర్‌ - 1 ప్యాకెట్ 
నీళ్ళు -10 కప్పులు 
పంచదార -1 కప్పు 
జీడిపప్పు -10 
యాలకుల పొడి -కొద్దిగా 

ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం:

ఒక మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు పోసి, బాగా మరగబెట్టాలి. 1/4కప్పు చల్లటి నీళ్లు తీసుకుని అందులో ఐస్‌క్రీమ్‌ పౌడర్ వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో వేసి బాగా కలియబెట్టాలి. 
ఇది కలుపుతున్నప్పుడు పల్చగా మజ్జిగ లాగా వెనిల్లా ఫ్లేవర్‌తో వుంటుంది. ఈ నీళ్లు బాగా తెర్లిన తర్వాత దించి ఎగ్‌బీటర్‌తో గానీ, మజ్జిగ కవ్వంతో కానీ బాగా నూరగ వచ్చేవరకు చిలికి చల్లారనివ్వాలి. తర్వాత దీనిని ఒక గిన్నెలో పోసి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టాలి. రెండు, మూడు గంటల తర్వాత ఇది బాగా గట్టిపడుతుంది. 
దానిని బయటికి తీసి స్పూన్‌తో బాగా కలిపితే ఐస్‌క్రీమ్‌ తయారవుతుంది. దీనిని చిన్న బౌల్స్‌లో వేసి పైన జీడిపప్పు, యాలకులపొడితో గార్నిష్ చేసి చల్ల చల్లగా సర్వ్‌ చేయాలి. అంతే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొనే ఐస్ క్రీం తయార్.