Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 16 December 2014

WINTER CARE HEALTH TIPS IN TELUGU - LIST OF FOOD ITEMS THAT GIVES PROTECTION FROM COLD WINTER



చలికాలంలో తప్పక తీసుకోవాలి

దాల్చినచెక్క
తీపిగా, వగరుగా ఉండే దాల్చిన చెక్క కూరల్లో, కేకుల్లో వాడతారు. కాఫీలో ఒక చిన్న చెక్క వేసినా రుచి పెరుగుతుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఎక్కువ వయసు ఉన్నవారికి, జబ్బుతో బాధపడుతున్నవారికి మంచిది. డయాబెటిక్‌ రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. 
యాలుకలు
మన సంప్రదాయపు తీపి వంటకాల్లో యాలకులది ముఖ్యస్థానం. ఆకుపచ్చని, బ్రౌన్‌ వెరైటీలలో యాలకులు దొరుకుతాయి. మంచి వాసననిచ్చే యాలకులు చలికాలం తీసుకుంటే మంచిది.
అల్లం
అల్లం కడుపునొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గులకు మంచి మందు. చలికాలం జీర్ణక్రియ కొద్దిగా లోపిస్తుంది. అల్లం టీలో వేసుకుని, సూప్‌లలో వేసుకుని తాగడం వలన మేలు జరుగుతుంది.
మిరియాలు
మిరియాలు పొడి చేయకుండా అలానే సూప్‌లలో, రసంలో వాడచ్చు. సలాడ్లలో మిరియాల పొడి చల్లుకుని తినచ్చు. దశాబ్దాల నుంచి దగ్గు, జలుబు, అజీర్ణం, నిద్రలేమికి మిరియాలు వాడడం సాధారనం.
లవంగాలు
దగ్గుకు సత్వర ఉపశమనం లవంగాలు. లవంగాలను బియ్యంతో తయారు చేసిన పదార్థాలు, కూరల్లో వేసుకుంటే రుచి, ఆరోగ్యం రెండూ.
వెల్లుల్లి
ప్రపంచవ్యాప్తంగా వెల్లుల్లిని వాడతారు. వెల్లుల్లి బ్యాక్టీరియా బారినుంచి రక్షించి రోగనిరోధకతను పెంచుతుంది.