Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 16 December 2014

WINTER CARE HEALTH WITH FRUITS - TIPS IN TELUGU - FRUITS THAT GIVES ENERGY AND HEALTH AND PROTECTION IN WINTER SEASON


శీతాకాలంలో ఎలాంటి పండ్లు తీసుకోవచ్చు?

శీతాకాలంలో విటమిన్‌ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవాలి. న్యూట్రీషియన్స్‌ ఉండాలి. 
శీతాకాలంలో దానిమ్మను తీసుకోవచ్చు. దానిమ్మను అలాగే తీసుకోవడం లేదా సలాడ్స్‌ రూపంలో తీసుకోవడం వంటివి చేయొచ్చు. ఇది క్యాన్సర్‌ కణాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పూర్తిగా కలిగి వండే ఈ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
సి విటమిన్‌ ఫ్రూట్స్‌ గల నిమ్మ, ఆరెంజ్‌, గ్రేప్‌ ఫ్రూట్స్‌, కివి ఫ్రూట్స్‌, కమలాలు వంటివి తీసుకోవాలి. కమలాలు తీసుకోవడం ద్వారా వింటర్లో ఏర్పడే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే వింటర్లో శరీరానికి కావలసిన ఎనర్జీ లభించాలంటే నిమ్మ, ఆరెంజ్‌, గ్రేవ్‌ ఫ్రూట్స్‌ తీసుకోవాల్సిందే.
ఫ్రూట్స్‌ జ్యూస్‌ తీసుకునేటప్పుడు వేడి చేసిన నీటిని చల్లార్చి వాటితో తయారు చేసిన జ్యూస్‌లను తీసుకోవడం మంచిది. అలాగే రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం పూట పండ్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.