Search This Blog

Chodavaramnet Followers

Monday 26 December 2016

TASTY BREAKFAST MYSORE BONDA RECIPE MAKING IN TELUGU


మైసూర్‌బోండా గుల్లగా ఎలా?

* మాకు మైసూర్‌బోండా అంటే చాలా ఇష్టం. ఇప్పటికే చాలాసార్లు ఇంట్లో ప్రయత్నించాను. కానీ, హోటళ్లలోలా గుండ్రంగా, రుచిగా రావడంలేదు. కొన్నిసార్లు లోపలిభాగం అసలు కాలడంలేదు. అది పైన గుల్లగా, లోపల మృదువుగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి.

• మైసూర్‌బోండా సరైన విధానంలో చేస్తే గనుక మీరన్నట్లుగానే వస్తుంది. నాలుగు వంతుల మైదాకి ఒక వంతు బియ్యప్పిండి తప్పనిసరిగా కలపాలి. అంతకన్నా ఎక్కువగా బియ్యప్పిండి కలిపితే చాలా గట్టిగా వస్తాయి. ఈ రెండింటినీ ఓ గిన్నెలో తీసుకుని కొద్దికొద్దిగా పుల్లటి మజ్జిగ పోస్తూ గారెల పిండిలా కలుపుకోవాలి. అది అందుబాటులో లేకపోతే నీళ్లు కూడా కలపొచ్చు. పొరపాటున నీళ్లు ఎక్కువైతే రెండు చెంచాల మైదాకి, చెంచా బియ్యప్పిండి చొప్పున కలుపుతూ సరిచేసుకోవాలి. బోండా లోపలి భాగం మెత్తగా రావాలంటే అందులో కొద్దిగా వంటసోడా వేయాలి. అది కూడా రెండు కప్పుల మైదాకి ముప్పావు చెంచా సోడా వాడాలి. పెరుగు పుల్లగా లేకపోతే పిండి కలిపిన తర్వాత ఒక గంటపాటు నాననివ్వాలి. అదే పుల్లని పెరుగయితే అరగంట నానితే సరిపోతుంది. ఇది రుచిగా రావాలంటే ఉప్పూ, పచ్చిమిర్చితోపాటూ అల్లం ముక్కలూ, జీలకర్ర వేసుకోవచ్చు. ఇంకాస్త రుచి కోసం పచ్చి కొబ్బరి తురుము కూడా ఉపయోగించొచ్చు. కాస్త కారంగా ఉండాలనుకుంటే మిరియాలూ, సన్నగా తరిగిన కరివేపాకూ, కాస్తంత ఇంగువా, కొత్తిమీర తరుగు వేయాలి. చేతికి కొద్దిగా నూనె రాసి ఈ పిండిని నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని కాగే నూనెలో వేయాలి. నూనెలో వేశాక బోండాలను కలియతిప్పుతూ ఉంటే అన్ని వైపులా బాగా వేగుతాయి. మీరు అనుకున్నట్లు హోటలు రుచిలో వస్తాయి.