Search This Blog

Chodavaramnet Followers

Thursday, 16 April 2015

FOR BEAUTIFUL BLACK HAIR TIPS IN TELUGU


నల్లని కురుల కోసం

ఎర్ర మందార పూలను రెండు గ్లాసుల నీళ్లలో వేసి, మరిగించి ఒక గ్లాసుకి వచ్చాక, వడగట్టి చల్లారాక ఒక సీసాలో పోసుకోవాలి. దీన్ని శిరోజాలకు రాసుకుని రెండు గంటల తర్వాత తలంటుకుటే పేను కొరుకుడు తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గి, నల్లగా అవుతుంది.

గుంటగలవరాకును దంచి రసం తీసి దానికి ఒక వంతు కొబ్బరి నూనె కలిపి, నీరు ఇగిరే దాకా మరిగించాలి. నూనె పైకి తేలిన తర్వాత వడకట్టి దాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాక, ఒత్తుగానూ పెరుగుతుంది.

మూలికా ఔషధాలతో చిన్న వయసులోనే నెరిసిపోయిన జుట్టుకు శాశ్వతంగా నలుపు చేయవచ్చుననే విషయం భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఉందని పెద్దలు చెబుతారు.

'నీలకేశ తైలం' జుట్టును నల్లగాను, ఒత్తుగాను, పొడవుగాను చెయ్యడానికి, తలనొప్పి, కళ్లనొప్పి, మంటలు, కళ్లు ఎర్రబారడం వగైరా వ్యాధులు సోకకకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది.

కొబ్బరిపాలు జుట్టు కుదుళ్లను దృఢం చేస్తాయి. కొబ్బరి పాలను మాడుకు పట్టించి తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మాయిశ్చరైజర్‌ లభించి మృదువుగా అవుతుంది.
కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో 2-3 గంటలు ఉంచాలి. తర్వాత తీసి దానిపైన ఏర్పడ్డ పొరను తొలగించాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి, వేడినీళ్లలో ముంచిన మెత్తని టవల్‌ను తలకు చుట్టాలి. గంటసేపు అలాగే ఉంచి, షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.