Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 28 June 2017

ARTICLE IN TELUGU ABOUT - SHATCHAKRAMULU - MANAVA SARIRAMLO SHAT CHAKRAMULU


మానవశరీరంలో షట్చక్రములు

మానవశరీరంలో షట్చక్రములు ఉన్నాయి. అవి
౧. మూలాధారం: ౨. స్వాధిష్ఠానము ౩. మణిపూరము ౪. అనాహతము ౫. విశుద్ధము.

ఇవి మానవశరీరంలో పంచభూత క్షేత్రములు. భ్రూమధ్య స్థానం జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పబడుతున్నది. ప్రపంచానికంతటికీ వెలుగునిస్తున్నాడు కాబట్టి జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతి అంటే వెలుగు, చైతన్యము. ఈభూమియందు మనకు వెలుగు చైతన్యం ఇచ్చే వాడు సూర్యుడు. ఆసూర్య మండలంలో వెలుగు పరమేశ్వరుడు. ఆదిత్యమండలాంతరవర్తి. ఒక్కొక్క మాసంలో ఒక్కోలా ప్రకాశిస్తున్నాడు.

ఈవిధంగా పన్నెండు రకాలుగా ఉన్న సూర్యుడిని ద్వాదశాదిత్యులు అంటాం. మనకు కనిపించే జ్యోతిర్లింగ స్వరూపమైన సూర్యుడిని ద్వాదశ సంఖ్యలో చెప్తున్నాం కనుక జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునికి కూడా ద్వాదశ సంఖ్య వచ్చింది. పన్నెండులో ప్రళయకాలాలలో కూడా నశించని గొప్ప జ్యోతిర్లింగ క్షేత్రం విశ్వేశ్వర లింగం. భ్రూమధ్య స్థానానికి కాశీ అని పేరు. ఇడ పింగళ నాడులకు మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఇడ, పింగళ నాడులు వరణ, అసి అనుకుంటే సుషుమ్న నాడి గంగ. ఈమూడు ఉన్న స్థలం వారణాశి.

సహస్రారం కైలాసం. కం - సుఖం, ఆనందం; కైలాసం అంటే ఆనందం లాస్యం చేసే చోటు. శిరస్సుకు ’కం’ అని పేరు. శిరస్సుపై శివశక్తులు కలిసి లాస్యం చేసే చోటు కైలాసం. సహస్రారమే శివశక్త్యైక్య రూపము, మహాకైలాసనిలయా మృణాళ మృదోర్లతా అని చెప్పబడుతున్నది. సహస్రారం కైలాసం, భ్రూమధ్యం కాశీక్షేత్రం. విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వరకు పంచభూతలింగములు. ఇవి మానవశరీరంలోని శివలింగ క్షేత్రములు. నీలో ఉన్నశివుడిని తెలుసుకుంటే అప్పుడు శివోహం అనే స్థాయికి చేరతాము.