Search This Blog

Chodavaramnet Followers

Friday, 16 December 2016

CHETTINAD KOLI MASALA - KODI MASALA RECIPE - CHICKEN MASALA TELUGU RECIPE


చెట్టినాడ్ కోళి మసాలా (కోడి మసాలా) 

కావలసినవి: 
ఉల్లిపాయలు - 50 గ్రా; 
టొమాటో - 60 గ్రా.
పచ్చిమిర్చి - 5;
కరివేపాకు - 2 రెమ్మలు
కారం - టీ స్పూన్;
ధనియాలపొడి - టీ స్పూన్
నూనె - 200 మి.లీ.;
సోంపు - టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25 గ్రా; నిమ్మకాయలు - 2
కోడిమాంసం - 500 గ్రా.
ఉప్పు: తగినంత

చెట్టినాడ్ మసాలా:
మరాఠీ మొగ్గ - 5 గ్రా.
బిర్యానీ ఆకు - 5 గ్రా;
లవంగాలు - 5 గ్రా;
జాజికాయ - 1
దాల్చినచెక్క - 5 గ్రా;
నల్లమిరియాలు - 10 గ్రా.
నల్ల ఏలకులు - 5 గ్రా;
పచ్చ ఏలకులు - 5 గ్రా.
ధనియాలు - 20 గ్రా;
రోజ్ పెటల్ - 5 గ్రా;
జీలకర్ర - 20 గ్రా.
సోంపు - 10 గ్రా;
కరివేపాకు (ఎండినది) - 20 గ్రా.
ఎండుమిర్చి - 25 గ్రా;
కొబ్బరి తురుము - 10 గ్రా.

తయారి:
స్టౌ పై పాన్ పెట్టి, చెట్టినాడ్ మసాలా దినుసులన్నీ వేసి, వేయించుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మరొక పాన్‌లో నూనె వేసి, సోంపు, త రిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. టొమాటో ముక్కలు వేసి ఉడికించాక ఇతర దినుసులు, ఉప్పు కలపాలి. అందులో చికెన్, చెట్టినాడ్ మసాలా కలిపి ఉడికించాలి. చివరగా కొబ్బరి, కొత్తిమీర, వేయించిన కరివేపాకు వేసి కలిపి దించాలి.