కార్తిక పౌర్ణమి విశిష్టత
పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉండడం వలన ఈ మాసాన్ని కార్తీక మాసమంటారు. ఈ మాసం లో చేసే సమస్త పూజలు, జపాలు, దానాలు, తీర్థ యాత్రలు, ఉపవాస దీక్షలు మొదలైనవన్నీ కూడా అత్యంత పుణ్యఫలితాలనిస్తాయి. ప్రత్యేకించి దీపారాధన సర్వ శ్రేష్ఠమైన విధుల్లో ఒకటి. జ్ఞానికి దీపం సంకేతం. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి వివేకరూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే వరదాయిని దీపం. దీపమున్న చోట జ్ఞానం ఐశ్వర్యం కలుగుతాయి. మన సంస్కృతి లో దీప రూపం లో భగవంతుడిని ఆరాదించడం అనాదిగా వస్తున్నది. చంద్రుడు మనసుకి ప్రతీక.పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపలు తొలగి, మోక్షం కలుగుతుందని చెబుతారు. దీని వల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసం లో చేసే దీప దానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పొర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. గంగా,గోదావరి మొదలైన పుణ్య నదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగ గా జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురున్ని సంహరించినట్లుగా పురాణాల ఆధారం గా తెలుస్తుంది. ఈ విజయాన్ని సంస్మరిస్తూ స్త్రీలు నేటి రాత్రి తులసి చెట్టు వద్ద 365 వత్తులను నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు. ఈ పవిత్ర దినాన విష్ణువాలయం లో స్థంబదీపం పెట్టినవారు శ్రీమహవిష్ణువు కి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసినవారి పాపాలు పటాపంచాలవుతాయని విశ్వసిస్తారు. స్థంబ దీపం పెట్టని పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు. ఈ రోజున ధ్వజస్థంభం పైన నందా దీపం వెలిగిస్తారు.
జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. శివ కేశవ బేదం లేని పరమ పవిత్రమైన మాసం లో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. జ్వాల తోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.
కార్తిక పౌర్ణమి
సౌందర్యాన్ని ఆశ్చర్యపరిచే జగత్సౌందర్యమే కార్త్తిక పూర్ణిమ. కార్త్తిక మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే తిథులలో కార్త్తిక పూర్ణిమ ఒకటి. శంకరుని అతి ప్రియమైన రోజు ఇది. ఈ రోజు కుమారస్వామిని దర్శించాలి. ఈశ్వరాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈరోజు చేసే దీపదానానికి ఎంతో విశేష ప్రాముఖ్యం ఉంది. శివుడు త్రిపురాసుడిని సంహరించింది ఈ పౌర్ణమినాడే. అందుకే త్రిపుర పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఈరోజున ఉదయంనుంచి ఉపవాసంఉండి ప్రదోషంలో అంటే సాయంకాంలో స్ర్తిలు దీపాలను వెలిగించాలి. తరువాత పురుషులు ఆ దీపాలను విధివిధానంగా ఆరాధించాలి. ఈ దీపారాధన ఉసిరిక చెట్టుకింద చేస్తే విశేష ఫలితాల్ని పొందవచ్చు. త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టి దోషపరిహారం కోసం ఇంకా విజయుడైన అతని గౌరవార్ధం పార్వతీదేవి మొదటిగా ఈ జ్వాలా తోరణాన్ని జరిపించిందనీ అప్పటినుండి ఇది ఆచారమైనదని కథనం. ఈ జ్వాలా తోరణాన్ని దర్శించడం వల్ల సర్వ పాపాలు హరించబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారించబడుతుందని ప్రతీతి. గడ్డిని తోరణంగా పేని దాన్ని వెలిగించి మంట చేసి ఆ మంటను కిందినుంచి పార్వతీదేవిని అటు ఇటు తిప్పుతారు. దీన్ని జ్వాలా తోరణం అంటారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినపుడు వెలువడ్డ హాలాహలాన్ని భరించలేక లోకాలు తల్లడిల్లిపోతుంటే తన భర్తను వేడుకుని హాలా హలాన్ని స్వీకరించి లోకాన్ని రక్షించమని ప్రార్థిస్తుంది. దానికి గుర్తుగానే ఈ జ్వాలా తోరణాన్ని నేటికీ వెలిగిస్తారంటారు. కొందరు ఈరోజు తులసిచెట్టు, ఉసిరి చెట్టు ముందు ముగ్గు పెట్టి, దీపం వెలిగించి షోడశోపచార పూజ చేసి తులసి దగ్గరే వంట చేసుకుని భోజనం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే తులసి, ఉసిరి చెట్లను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించి మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు శివుడిని పూజించి భక్తేశ్వర వ్రతం చేయాలి. ఈ దినం పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడిని అభిషేకించి, మారేడు దళాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వ్రతం చేసినట్టయితే వైధవ్య బాధలు వుండవని శాస్త్రాలు చెప్తున్నాయి.
కార్తిక పౌర్ణమి రోజున ముత్తయిదువలు ఆచరించి తమ ఐదోతనాన్ని కాపాడమని పరమేశ్వరుడ్ని ప్రార్థించుకుంటారు. సాక్షాత్తు సర్వమంగళాదేవి అయిన మంగళగౌరి కూడా కార్తీకమాసంలో దీపాల్ని వెలిగించి మురిసిపోతుందిట. అందుకే ఈరోజు దీపారాధనకు ప్రాముఖ్యత ఏర్పడింది.
కార్తికపూర్ణిమ నాడు మనసును ప్రశాంతంగా ఉంచి, ‘ఓం నమఃశ్శివాయ’అంటే చాలు, ఒక పవిత్ర శక్తి ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రదక్షిణం చేసి గంగలో మూడు మునకలు వేసి పరమోత్కృష్టమైన కైలాస శిఖరాన్ని తాకి, మనపై కారుణ్యామృతాన్ని వర్షిస్తుందని శివపురాణం స్పష్టం చేస్తోంది. జలం, జ్వాల ఈ రెండును ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకే నదుల్లో స్నానమాచరించి, దీప తోరణాలను చెరువుల్లోకానీ, బావుల్లోకానీ నదుల్లోకానీ వదలడం కన్నుల పండువగా కన్పిస్తుంది. కార్తీక దామోదరునిగా ప్రసిద్ధి చెందిన విష్ణువును ఉసిరిక చెట్టుకింద దీపంపెట్టి వేదపఠనం కావించి అర్చిస్తారు. తులసి కోట దగ్గర శివాలయంలోను మున్నూట అరవై వత్తులతో దీపారాధన చేస్తారు.
శ్రీహరి దేవేరియైన శ్రీ మహాలక్ష్మి కార్తీకపూర్ణిమనాడు ఇంటింటికీ వస్తుందని, ఏ ఇంట శివలింగారాధన జరుగుతుందో శివనామ స్మరణ జరుగుతుందో ఆ ఇంట రహస్య శక్తులతో ప్రవేశిస్తుంది. దీపాలు ఎవరి ఇంట ఈరోజు సాయంకాలం వెలిగిస్తారో వారి దారిద్య్రం తొలగిపోతుంది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలి ఆకాశాన నిండు చంద్రుడు నిలిచిన పూర్ణిమనాడు చంద్రోదయ సమయంలో నదులలో, అరటి దొప్పలలో ఆవునేయితో దీపాలను వెలిగించి వదులుతారు. అందుకే కార్తీక మాసానికి సమమైన మాసం ఇంకేదీ లేదని చెప్తారు. ఇన్ని లక్షణాలున్న కార్తీక మాసాన్ని, ముఖ్యంగా పౌర్ణమినాడు మనమందరం కూడా దీపారాధన చేసి దీపాలను నీటిలో వదిలి ఆ శివకేశవుల ప్రీతికి పాత్రులవుదాం.