Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 16 November 2016

BIRTH STORIES OF LORD ANJANEYA SWAMY


హనుమంతుని జన్మరహస్యాలు

హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వివరించడానికి శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది.

శివమహాపురాణంలోని కథ :
పూర్వం శివుడు రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో తన వీర్యాన్ని స్ఖలనం చేశాడు. సప్తమహర్షులు దానిని సాదరంగా ఒకచోట పొందుపరిచారు. కొన్నాళ్ల తరువాత ఆ శివుని వీర్యాన్ని.. గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెడతారు. ఫలితంగా మహాబలవంతుడు, పరాక్రమవంతుడైన వానరదేహంతో హనుమంతుడు జన్మించాడని శివపురాణంలో తెలపబడింది.
ఆ విధంగా హరుని అంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడిగా, శివసుతుడిగా శివపురాణంలో వర్ణించబడింది. త్రిపురా సంహారంలో విష్ణువు, పరమశివుడికి సహకరించినందువల్ల ఆయన కృతజ్ఞుడై.. హనుమంతుడిగా అవతరించాడు. అలాగే రావణుడిని సంహరించడానికి శ్రీరాముడికి సహకరించాడని ఈ పురాణంలో పేర్కొనబడింది.

గ్రంథంలోని కథ :
పూర్వం ఒకనాడు రాక్షసులను సంహరించడం కోసం విష్ణువు, పరమశివునికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచనమేరకు శివుడు త్రిమూర్తుల తేజస్సును మింగుతాడు. ఆ తేజస్సు కారణంగా పార్వతీదేవి, శివుని వీర్యాన్ని భరించలేక.. అగ్నిదేవునికి ఇస్తుంది. అగ్నిదేవుడు కూడా ఆ వీర్యాన్ని భరించలేక వాయుదేవునికి అప్పగిస్తాడు. అప్పుడు వాయుదేవుడు ఆ వీర్యాన్ని ఒక మండురూపంలో మలిచి.. పుత్రిడికోసం ప్రార్థిస్తున్న అంజనాదేవికి ఇస్తాడు.

అంజనాదేవి ఆ పండును తినడంతో గర్భం దాల్చి, కాలక్రమంలో ఆంజనేయునిని జన్మనిచ్చింది. వాయుదేవుడిచ్చి ప్రసాదంతో ఆంజనేయుడు జన్మించడంతో వాయునందనుడు అనే పేరు కలిగిందని ఈ సంహితంలో వివరించబడి వుంది. భగవంతుని అనుగ్రమం వల్లే పుట్టాడు కనుక.. ఆమెకు కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి పేర్కొన్నట్టు ఈ గ్రంథంలో సూచించబడింది.

రామాయణంలోని కథ :
దేవలోకంలోని వుండే పుంజికస్థల అనే ఒక అప్సరస.. బృహస్పతి శాపంవల్ల భూలోకంలోని వానర ప్రభువైన కుంజరునికి అంజనాదేవిగా జన్మించింది. యుక్తవయస్సు వచ్చిన తరువాత ఆమె వానరరాజైన కేసరికి భార్య అయింది. ఒకనాడు కేసరి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లేముందు.. అంజనాదేవిని వాయుదేవునికి అప్పగించి వెళ్లిపోతాడు.

ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత ఒకరోజు వాయుదేవుడు, అంజనాదేవి అందానికి మోహితుడై ఆమెను కౌగిలించుకున్నాడు. వాయుదేవుడు మనస్సుతో ఆమెను పూర్తిగా అనుభవించాడు కనుక.. ఆమె ఏకపత్నీ వ్రతం భంగం కాలేదని ధైర్యం చెప్పి.. పరాక్రమవంతుడైన ఒక పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చి, తృప్తిపరిచాడు. దాంతో అంజనాదేవి ఎంతో సంతోషించి.. వైశాఖ బహుళ దశమినాడు ఒక గుహలో ఆంజనేయుడిని ప్రసవించింది.

హనుమంతుని పేరు :
పూర్వం ఒకనాడు ఒక బాలుడు (హనుమంతుడు) ఉదయించే సూర్యుడిని చూసి తినే పండు అనుకుంటాడు. దానిని తినాలనే కోరికతో ఆకాశంవైపు 300 యోజనాలు ఎగిరి.. సూర్యతేజస్సును ఆక్రమించుకుంటాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు కోపాద్రిక్తుడై తన వజ్రాయుధంతో ఆ బాలుడిని కొడతాడు. ఆ దెబ్బతో ఆ బాలుడి హనువు (గడ్డం) విరిగింది. దాంతో ఆ బాలుడి పేరు హనుమంతుడిగా పిలవడం జరిగింది. ఇలా ఈ విధంగా ఆయన పుట్టుకకు సంబంధించిన కథలు వున్నాయి.