యుక్త వయసులో ఉన్న వారు స్నాక్స్ ఎక్కువ తినటాన్ని ఎక్కువ చేయాలి.
భోజనము, ఉదయం తీసుకునే ఆహరంలో అధిక క్యాలోరీలను అందించే ఆహ్రాలను కలపండి.
అవసరమైన మోతాదులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యవంతమైన కొవ్వులను తీసుకోండి.
యుక్త వయసు ఉన్న వారికి పోషకాలు మరియు క్యాలోరీలు ఎక్కువగా అవసరం. కొన్ని సమయాలలో, ఈ వయసులో కలిగే జీవక్రియలో పెరుగుదల మరియు హార్మోన్’లలో కలిగే మార్పుల వలన బరువు పెరగటం చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా, మీరు మంచి ఆహారాన్ని, క్యాలోరీల స్థాయిలను తీసుకోవటం ఎక్కువ చేయటం వలన మీ బరువును పెంచుకోవచ్చు.
యుక్త వయసులో బరువు పెరగాలి అనుకుంటే మాత్రం మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఈ వయసులో బరువు పెరగాలంటే మీరు 500-1000 క్యాలోరీలను ఎక్కువగా తీసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహరం తినటం వలన మీ బరువు పెరుగుదలకు కావలసిన క్యాలోరీలు వీటి నుండి పొందుతారు. ఉదాహరణకు బాదము మరియు హోల్ గ్రైన్స్ అధిక పోషకాలను కలిగి ఉంటాయి.
ఆలివ్ ఆయిల్ ప్రాముఖ్యత
మీరు రోజు తినే ఆహారంలో అన్-సాచురేటేడ్ కొవ్వు పదార్థాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోండి. విత్తనాలు, అవకాడో, వంటివి మీ ఆహారంలో కలుపుకోండి. మీరు ప్రతి రోజు తయారు చేసుకునే భోజనం, తినే స్నాక్స్’లను ఆలివ్ ఆయిల్’తో చేసుకోండి. మీరు తినే ఆహారంలో వెన్న లేదా ఆలివ్ ఆయిల్’ని కలపండి వీటి వలన త్వరగా బరువు పెరుగుతారు. క్యాలోరీల సంఖ్యని పెంచుకోటానికి పాస్తాలో చీస్’ని కలుపుకొని తినండి.
బరువు పెంచుకోటానికి, యుక్త వయసులో ఉన్న వారు స్నాక్స్ తినటాన్ని ఎక్కువ చేయాలి. సోడా లేదా చిప్స్ వంటివి తినకండి, వీటికి బదులుగా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోండి. సోడాకి బదులుగా మంచి పండ్ల రసాలను, స్నాక్స్’లో తాజా పండ్లను తినండి .
ఫైబర్స్ ఆధారిత ఆహార పదార్థాలు
యుక్త వయసులో ఉన్న వారి ఆహారంలో ఎక్కువ ఫైబర్స్ ఉండేలా చూసుకోవాలి. లేగ్యుం, ఓట్స్, బ్రోకలి, క్యారెట్, హోల్ గ్రైన్ ఫుడ్, వీట్, విత్తనాలు, గింజలు, బంగాళదుంప, అవకాడో, అరటిపండు వంటి ఎక్కువ ఫైబర్స్ ఉన్న వాటిని తీసుకోవాలి.
milk
అధిక క్యాలోరీలను అందించే ఆహరం
యుక్త వయసులో వారి శరీర పెరుగుదల వేగంగా ఉంటుంది కావున వారికి ఎక్కువ క్యాలోరీలు అవసరం, ఎక్కువ క్యాలోరీలను కలిగి ఉండే పాల పదార్థాలు కూడా తీసుకోవాలి. తృణధాన్యాలు, ఓట్మీల్, చీస్ ఎక్కువగా ఉన్న ఆమ్లెట్, కాల్చిన బంగాలదుంపలు సులువుగా, త్వరగా మరియు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ బరువు పెరగటానికి ఉపయోగపడతాయి.
యుక్త వయసులో పాల ద్వారా బరువు పెరగవచ్చు. భోజనము మరియు ఉదయం తీసుకునే ఆహరం తరువాత ఒక గ్లాసు త్రాగటం వలన మీ బరువు సులువుగా పెరుగుతుంది.
భోజనం తరువాత ఆరోగ్యాన్ని పెంపొందించే ద్రావనాలను తాగండి. ఫ్రూట్ షేక్స్, మిల్క్ షేక్స్, మంచి ద్రావనాలను తాగటం వల్ల బరువు పెరుగుతుంది.
అవసరమైన మోతాదులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మరియు ఆరోగ్యవంతమైన ఫాట్’లను తీసుకోండి.
మీరు తీసుకునే ఆహారానికి ఎక్కువ మోత్తంలో క్యాలోరీలు ఉన్న వాటిని కలపండి.
యుక్త వయసులో ఉన్న వారికి కావలసిన క్యాలోరీలు
శరీరానికి కావలసిన క్యాలోరీలు వారి వయసు మరియు లింగత్వం బట్టి మారుతుంది. సాధారణంగా యుక్త వయసులో ఉన్న వారికి 1,800 నుండి 3,500 క్యాలోరీలు అవసరం. ‘US’కి సంబంధించిన ‘అగ్రికల్చర్ డైఎటారీ’ వాళ్ళు తెలిపిన దాని ప్రకారం, యుక్త వయసులో ఉన్న ఆడవారికి రోజులో 1,800 నుండి 2,400 క్యాలోరీలు, యుక్త వయసులో ఉన్న అబ్బాయిలకి 2,200 నుండి 3,200 క్యాలోరీలు అవసరమని తెలిపారు.
మీరు బరువు పెరగాలి అనుకున్నపుడు వైద్యుడిని సంప్రదించి, రోజులో ఎన్ని క్యాలోరీలు అవసమో, వాటికి తగినట్టుగా ఆహార నియమాలని ప్రణాళికగా తయారు చేసుకొని అనుసరించండి.