Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 14 September 2016

HOW TO REMOVE BLACK SPOTS ON NOSE BY WEARING GOOGLES


కళ్ళజోడు పెట్టుకోవటం అనేది స్టైల్ గా ఉన్నా సరే ముక్కు మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ముక్కుకు రెండు వైపులా ఏర్పడతాయి. ఈ మచ్చలను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

కలబంద జెల్‌ను మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతి రోజు ఈ విధంగా చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.

ప్రతి రోజు మచ్చలపై తేనే రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.

ఒక బౌల్ లో నిమ్మరసంలో కొంచెం నీటిని పోసి కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప ముక్కతో ప్రభావిత ప్రాంతంలో రుద్దితే మచ్చలు తగ్గుతాయి.

నారింజతొక్కలను ఎండబెట్టి, పొడిగా చేయాలి. ఈ పొడిలో సరిపడా పాలను పోసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. మచ్చలు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ ని రాసి 25 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అవకాడో పండును మెత్తని గుజ్జుగా చేసుకొని, మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. అవకాడో పండులో ఉండే సహజమైన ఔషద గుణాల కారణంగా పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.

శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఈ విధంగా రోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.

స్టాబెర్రీలో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. అందువలన స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.