Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 14 September 2016

HEALTH TIPS FOR WORKING SITTING POSITIONS IN OFFICE - LIST OF GOOD FOOD ITEMS FOR BACK BONE PROTECTION


1. కూర్చునే విధానం: కూర్చునే విధానంలో జాగ్రత్త వహించకపోవడం వల్లే ఎక్కువ మంది ఉద్యోగుల బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్స్ చెబుతున్నారు. కాబట్టి చెయిర్‌లో కూర్చున్నప్పుడు మీ వెన్ను భాగమంతా చెయిర్‌కి ఆనుకోవాలి. కాళ్లు ఫ్లోర్‌కి తాకాలి. ఇలా కూర్చోవడం వల్ల వెన్నుపై ఒత్తిడి పడదని డాక్టర్స్ చెబుతున్నారు.

2. సరైన చెయిర్: ఈజీ చెయిర్స్, బీన్ బ్యాగ్స్, సాఫ్ట్‌గా ఉండే సోఫాలలో కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని స్టడీస్ చెబుతున్నాయి. అలాగే క్రాస్ లెగ్స్ ఉండే చెయిర్స్‌లో ఎక్కువ సమయం కూర్చోవడం కూడా సేఫ్ కాదని సూచిస్తున్నారు. కాబట్టి మీరు కూర్చునప్పుడు మీకు అనుకూలంగా చెయిర్ ఉందా లేదా అనేది సరిచూసుకోవాలి. అలాగే కింద కూర్చోవాల్సి వచ్చినప్పుడు వెన్నుకి సపోర్ట్ ఉండేలా జాగ్రత్త పడాలి.

3. ఆహారం: డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి3, విటమిన్ బి12, క్యాల్షియం శరీరానికి పుష్కలంగా అందినప్పుడే ఎముకలు, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.

4. హైడ్రేటెడ్‌గా ఉండటం: మన వెన్నెముక ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల అది హెల్తీగా ఉంటుంది.

5. వెన్నుపై ఒత్తిడి: కిందకు వంగి ఏదైనా అందుకోవాల్సి వచ్చినప్పుడు మోకాళ్లను వంచాలి. లేదంటే వెన్నుపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి శరీరాన్ని కిందకు బెండ్ చేయాల్సి వచ్చినప్పుడు, బరువైన వస్తువు ఎత్తేటప్పుడు మోకాళ్లను బెండ్ చేయాలి.

6. టైపింగ్ లేదా వ్రాసేటప్పుడు: టైపింగ్ లేదా వ్రాసేటప్పుడు మణికట్టుకి ఖచ్చితంగా టేబుల్ పై సపోర్ట్ ఉండాలి. దీనివల్ల అనవసర ఒత్తిడిని నివారించవచ్చు.

7. కంప్యూటర్ స్క్రీన్: కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ ఖచ్చితంగా మీ కంటి చూపు లెవెల్‌లో ఉండాలి. అంతేకానీ మీ కంటి చూపుకి కిందివైపు లేదా పైకి ఉండరాదు.