జీర్ణానికి బొప్పాయి...
ఆకర్షణీయమైన రంగుతో నోరూరించే బొప్పాయి పండులో పోషకాల మోతాదు ఎక్కువే.
* బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ పండులో అధికంగా లభించే పీచు, నీటి శాతం మలబద్ధకాన్ని నివారిస్తాయి.
* దీనిలో లభించే యాంటీ ఆక్సిడెంట్ జియాక్జింథిన్ హానికారక కిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరో పోషకం విటమిన్ ఎ సీబమ్ ఉత్పత్తిలో కీలకంగా ఉపయోగపడుతుంది. జుట్టుని తేమగా ఉంచుతుంది.
* బీటాకెరొటిన్ పుష్కలంగా లభించే బొప్పాయిని తరచూ తీసుకోవడం వల్ల ఉబ్బసం ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.