Search This Blog

Chodavaramnet Followers

Monday 11 July 2016

CHAMANTHI FLOWER TEA HEALTH AND BEAUTY BENEFITS


చామంతి టీ చమక్కుమనిపిస్తుంది

గ్రీన్‌ టీనే కాదు...పూల తేనీరు తాగడం వల్లా బోలెడు ప్రయోజనాలు అంటున్నాయి తాజా అధ్యయనాలు. అందాన్ని ఇనుమడింప చేయడంలో చామంతి టీది ప్రత్యేక స్థానం..

* చామంతి టీని ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. ఇది వడలిన చర్మం తక్షణ ఉపశమనం పొందేలా చేస్తుంది. దీనిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మగ్రంథుల లోపలివరకూ చొచ్చుకునిపోయి శుభ్రం చేస్తాయి. చర్మం తాజాగానూ ఉంటుంది. అంతేనా కాలిన గాయాలు, దోమకాటు వల్ల వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.

* చర్మంపై పేరుకున్న టాన్‌ ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తుంది. చామంతి టీని రోజూ ముఖానికి రాసుకుంటే సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌లా ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరిచి వన్నెలీనేలా చేస్తుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఫలితంగా ముఖంపై ఏర్పడే మచ్చలు వంటివి తగ్గుముఖం పడతాయి.

* నిద్రలేమి, పని ఒత్తిడి ...ఇతరత్రా కారణాలు కళ్లకింద వాపు వస్తుంది. ఇలాంటప్పుడు చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటి అలసటా తగ్గుతుంది. కళ్లకింద ఏర్పడే నల్లటి వలయాలూ దూరమవుతాయి.

* కప్పున్నర పాలపొడికి, అరకప్పు చామంతి టీని చేర్చి మెత్తగా కలపాలి. దీన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దాలి. ఇది సహజ స్క్రబ్‌లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది. చర్మం తేమగానూ ఉంటుంది.

* పావుకప్పు గోరింటాకు పొడికి చామంతి టీని చేర్చి నానబెట్టాలి. దీన్ని నాలుగైదు గంటల తరవాత తలకు పట్టించి...మరో గంట ఉంచాలి. ఆపై తలస్నానం చేస్తే జుట్టుకి తగిన పోషణ అందుతుంది. మెరుపులీనుతుంది.