Search This Blog

Chodavaramnet Followers

Tuesday 24 May 2016

SHINY AND BEAUTIFUL SKIN WITH EATING FRUITS REGULARLY


పళ్లతో చర్మం నిగారింపు 

పళ్లు రోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు మీ చర్మం కాంతులీనుతుంది కూడా. ముఖ్యంగా కొన్ని పళ్లు ఉన్నాయి. అవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుతాయి. 

అవి... 

యాపిల్స్‌లో మాలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడమే కాదు నవయవ్వనంగా కనిపించేలా చేస్తుంది. యాపిల్స్‌లో పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. పెద్దప్రేవు ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. చర్మంపై మొటిమలు రావు.

అవకెడోలో పోషకపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటారు కూడా. రుచి ఎంతో బాగుండడమే కాదు చర్మంకు మంచి నిగారింపును ఇస్తుంది. వీటిల్లో విటమిన్‌ బి7 ఉంటుంది. ఇది కణాల పునరుత్పత్తికి, పెరుగుదలకు సహకరిస్తుంది. జుట్టు, గోళ్లు వేగంగా పెరుగుతాయి. స్కిన్‌ ప్రొటెక్టర్‌గా భావించే విటమిన్‌-ఇ కూడా ఇందులో ఉంది.
అరటిపళ్లల్లో ఎక్కువ శాతం పొటాషియం ఉంటుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేయడమే కాదు చర్మాన్ని ఎంతో హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చర్మం మృదువుగా ఉండేట్టు చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఇతర విటమిన్లు కూడా అంటే విటమిన్‌-ఎ, బి, ఇ లు కూడా ఇందులో ఉంటాయి. అరటిపండులోని న్యూట్రియంట్లు చర్మం సాగేగుణాన్ని కాపాడుతుంది. ప్రిమెచ్యూర్‌ ఏజింగ్‌ రాకుండా, చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. చర్మంపై ఏర్పడే నల్లని మచ్చల్ని సైతం పోగొడుతుంది.
నిమ్మను నేచర్స్‌ బ్లీచ్‌గా బ్యూటీ నిపుణులు పేర్కొంటారు. ఇవి చర్మాన్ని తెల్లగా, మెరిసేలా చేస్తాయి. తేనె, నిమ్మకాయ పిండిన గోరువెచ్చటి నీళ్లు పరగడుపునే తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల చర్మంపై మచ్చలు పోతాయి. యాక్నేని క్లీన్సింగ్‌ చేస్తుంది. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.

దానిమ్మను కూడా సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంట్లో న్యూట్రియంట్లు బాగా ఉన్నాయి. యాంటాక్సిడెంట్లు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటి వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. దీన్ని తింటే గ్రీన్‌ టీ తాగడం వల్ల పొందే ఆరోగ్య లాభాలన్నీ పొందుతాము.

పైనాపిల్‌లో బ్రొమోలైన్‌ ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మంచిది. చర్మంపై ఉండే మృత కణాలను పోగొడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
సా్ట్రబెర్రీ్‌సలో విటమిన్‌-సి బాగా ఉంటుంది. దీంట్లో ఆల్ఫా హైడ్రాక్సల్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది చర్మం అందాన్ని ఇనుమడింపచేస్తుంది. వైట్‌హెడ్స్‌, బ్లాక్‌హెడ్స్‌ను పోగొడుతుంది. వీటిల్లో ఎల్లాజిక్‌ యాసిడ్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఉంది. ఇది చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. రోజూ సా్ట్రబెర్రీలు తింటే చర్మం బాగా కాంతులీనుతుంది.