Search This Blog

Chodavaramnet Followers

Tuesday 24 May 2016

HIGH B.P WITH EATING POTATOS


 బంగాళదుంప = హై బీపీ 

వారంలో నాలుగు రోజులు బంగాళదుంపలు తింటే రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. 
ఉడికించిన లేక వేయించిన బంగాళదుంపలను వారంలో నాలుగు లేక అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకున్నట్లయితే అధిక రక్తపోటు రిస్క్‌ పెరుగుతుంది. 

ఈ విషయం ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. యూఎస్‌లో 20 ఏళ్లకు పైగా నిర్వహించిన మూడు అధ్యయనాల్లో 1,87,000 మందిపై పరిశోధనలు చేశారు. ప్రశ్నావళిని ఉపయోగించి ఎన్నిసార్లు బంగాళదుంపలను తీసుకుంటున్నారో లెక్కించారు. హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను గుర్తించారు. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ద్వారా కూడా హైపర్‌టెన్షన్‌ రిస్క్‌ ఉందని పరిశోధకులు తేల్చారు. ఇది పురుషులకు, సీ్త్రలకు సమానంగా వర్తిస్తుంది.