Search This Blog

Chodavaramnet Followers

Tuesday 24 May 2016

HEALTH TIPS FOR CURE OF HEPATITIS - B DISEASE


హెపటైటిస్‌-బి (Hepatitis B) అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది.

హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని 'అక్యూట్‌' దశ అంటారు. కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో మనం HBsAg పరీక్ష చేస్తే 'పాజిటివ్‌' వస్తుంది. అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌-బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి 'లివర్‌ ఫంక్షన్‌ టెస్టు'ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.
సురక్షిత చిట్కాలు:
-ఔషధాలు, హార్మోన్లు, స్టెరాయిడ్లు మరియు విటమిన్లు ఎక్కించుకునేందుకు ఒకరు వాడిన సూదులను మరొకరు వాడకూడదు. ఇంజెక్షన్‌ చేసుకోవడానికి ముందు చేతులు కడుక్కోవాలి.
-కండోమ్‌లు మరియు బ్యారియర్లు ఉపయోగించడం లైంగిక జబ్బులు సంక్రమించే అపాయాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే హెపటైటిస్‌-బి రోగులతో పోల్చుకుంటే హెపటైటిస్‌-సి రోగుల్లో సంక్రమణ అపాయం చాలా తక్కువగా ఉంటుంది.
-గర్భధారణ కాలంలో లేదా బిడ్డ పుట్టిన సమయంలో హెపటైటిస్‌-బి తల్లి తన పాపాయికి సంక్రమింపజేయవచ్చు. కాబట్టి గర్భం దాల్చటానికి ముందు మీ డాక్టరును సంప్రదించండి. హెపటైటిస్‌-సితో ఇది చాలా తరచుగా కలగదు.
-ఆరోగ్య సంరక్షణ సెట్టింగుల్లో ప్రామాణిక సురక్షిత ముందుజాగ్రత్తలు జాగ్రత్తగా పాటించేలా నిర్థారించుకోండి.
-రేజర్లు, టూత్‌బ్రష్‌లు, నెయిర్‌ కట్టర్లు లేదా గుచ్చుకునే చెవి పిన్నులు లాంటి వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులను మరొకరితో పంచుకోవద్దు.