Search This Blog

Chodavaramnet Followers

Thursday, 17 March 2016

MASALA PEETHALA VEPUDU - MASALA CRABS FRY RECIPE IN TELUGU


Masala Peethala Fry (మషాల పీతల వేపుడు)::

కావలసిన పదార్దములు :
పీతలు : అరకిలో
టమాటాలు : రెండు 
కొబ్బరి ముక్కలు : కప్పు
గసగసాలు : రెండు టీ స్పూన్లు (నానబెట్టాలి )
కారం : రెండు టీ స్పూన్లు
ఉప్పు : సరిపడా
నూనె : కప్పు
కొత్తిమీర : చిన్న కట్ట
మషాల : అర టీ స్పూన్
దనియాలు : టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్
పచ్చిమిర్చి : మూడు
మిరియాలు : పావు టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్

తయారుచేయు విధానం :
1) పీతలు శుబ్రం చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉ డికించి పక్కన పెట్టాలి.
2) మిక్సి జార్లో నానబెట్టిన గసాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యేలా మిక్స్ చెయ్యాలి.
3) తరువాత దానిలోనే కారం, ఉప్పు, మిర్చి, కొబ్బరిముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్తూ, గరంమషాల వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి.
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. కాగాక కరివేపాకు వేసి వేగాక రుబ్బిన మషాల ముద్ద వేసి గరిటతో కలుపుతూ మంచి వాసనవచ్చే వరకు వేయించాలి.
5) ఇప్పుడు ఉడికించిన పీతలు వేసి చిన్నమంటమీద వేయించాలి. చక్కటి వాసన వచ్చే వరకు వేయించి కొత్తిమీర జల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆపాలి.

అంతే మసాలా పీతల వేపుడు రెడీ.