Search This Blog

Chodavaramnet Followers

Wednesday 16 March 2016

EGG DRUMSTICKS TASTY RECIPE - GUDLU MULAKADALU KURA


గుడ్లు ములక్కాడలు కూర

కావలసిన పదార్దాలు : 
గుడ్లు : ఆరు 
ములక్కాడలు : నాలుగు 
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : మూడు
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
గరం మసాలా : అర టీ స్పూన్
చింతపండు : నిమ్మకాయంత
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావు టీ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా
టమాటాలు : రెండు

తయారుచేయు విధానం:-
1) గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. ములక్కాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.

2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.

3) అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లం-వేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాటముక్కలు వేసి మగ్గిన తరువాత ములక్కాడముక్కలు వేసి కలిపి, ఒక నిముషం మూతపెట్టాలి.

4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండు రసం, గుడ్లు వేసి మరో ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.