Search This Blog

Chodavaramnet Followers

Monday, 1 February 2016

paralysis health tips - Ayurvedam Health tips for paralysis


పక్షవాతం - కారణాలు - నివారణా మార్గాలు 
పక్షవాతం రావడానికి గల కారణాలు

అతిమైధునం , బలవంతంగా మలమూత్రాలు ఆపుట , మనిషి శరీరంలోని 7 రకాల ధాతువులు క్షీణించుట, అధికంగా చింతించడం, దుఖించడం . మొదలయినవి ప్రధాన కారణాలు .

ఈ కారణముల వలన వాతం ప్రకోపించి నానా విధములు అగు వాతరోగాలు కలిగించును. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం వాత వ్యాధులు 80 రకాలుగా వర్గీకరించ బడినవి. అశీతి వాతములలోను సర్వాంగ వాతము అతిభయంకర మయినది. పక్షవాతం కుడి చేయి , కుడి కాలు, లేదా ఎడమ చేయి , ఎడమ కాలు ఇలా ఒక పక్క వచ్చును. పక్షవాతం మొదటిసారి వచ్చినపుడు ప్రమాదకరం కాదు. రెండు మూడు నెలలలో తగ్గును రెండొవ సారి వచ్చినపుడు ప్రమాదకరం . మూడోసారి వస్తే తగ్గుట అసాధ్యం .

ఈ అశీతి వాతములకు ప్రత్యేకంగా 80 రకాల ఔషధాలు వైద్య గ్రంధములు యందు చెప్పబడినవి.

పక్షవాత రోగులు వాడదగినవి -

వంకాయ, ములగకాయ, కాకరకాయ, ముల్లంగి , కంద, పాతబియ్యం, బూడిద గుమ్మడికాయ, మినుములు , ఉలవలు, గొధుమలు, నూనె , జీలకర్ర, ఇంగువ ఇలా తేలికగా జీర్ణం అవునవి, వేడిచేయునవి వాడవచ్చును.

వాడకుడని వస్తువులు -

దోసకాయ , సొరకాయ, పెసలు, బీరకాయ, పెరుగు అజీర్ణకర పదార్దాలు , చల్లని ప్రదేశంలో ఉండకూడదు .

తరువాతి పోస్టులో పక్షవాతం నివారణా మార్గాల గురించి మీకు తెలియ చేస్తాను .