Search This Blog

Chodavaramnet Followers

Monday, 1 February 2016

GODDESS SRI MAHALAKSHMI PUJA PRAYER


శ్రీ మాత్రే నమః
.

అమృతమధనం జరిగిన సమయంలో, అందులోనుంచి 
కల్పవృక్షం,కామధేనువు,పాంచజన్యం, పారిజాతం, ఉచ్చై శ్రావం, ఐరావతం, కౌస్తుభమణి, కాలకూటం, చంద్రుడు, లక్ష్మిదేవి ఉద్భవించడం జరిగింది. 

వీళ్ళందరూ సోదరసోదరీ గణం కాబట్టి లక్ష్మీదేవికి వాళ్ళపోలికలు కొన్నివచ్చాయి. 
చంద్రుని నుంచి వక్రత్వం, ఉచ్చైశ్రవం నుంచి చంచలత్వం, 
విషం నుంచి మైకం, అమృతం నుంచి మదం, 
కౌస్తుభమణి నుంచి కాఠిన్యం లక్ష్మీదేవికి వచ్చాయి.
.

అందుకే ఆమే ఎప్పుడు, ఎందుకు దూరంగా వెళ్ళుతుందో తెలియదు.
అయితే విద్యాసంపన్నుల దగ్గర ఆమే ఎందుకు ఉందటం లేదన్నది ప్రశ్న. 
ఆ తల్లి వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నది నిఝం. భౌతికమైన ధనరూపంలో కాదు.
ఎన్ని వేల కోట్ల రూపాయలను గుమ్మరించిన రాని ఆత్మ శాంతి, స్తిథప్రగ్న్యత
రూపంలో ఆమే వారి మన్సుల్లో ఉంటుంది.

అమ్మ మనలోనే ఉంది అన్న విషియం గ్రహించటానికి కూడా ఆవిడే శక్తి ఇవ్వాలి...!

శ్రీ మాత్రే నమః.