Search This Blog

Chodavaramnet Followers

Thursday, 10 December 2015

Why Indian married Women Wear Toe RIngs - Information in telugu


స్త్రీలు మెట్టెలు ఎందుకు ధరిస్తారు 

.సాధారణంగా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలు కాళ్లకు మెట్టలు ధరిస్తారు…ఇది కేవలం ఆమెకు పెళ్లి అయ్యిందని సూచించడమే కాదు. దానికి ఓ ప్రత్యేకత ఉంది .

సాధారణంగా స్త్రీలు కాలి రెండవ వేలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది. ఇది రక్తప్రసరణను నియంత్రించి రుతుచక్రం సక్రమంగా వచ్చి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది..అందుకే వెండితో చేసిన మెట్టలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు. కేవలం మెట్టెల్లోనే కాదు.. నుదుటి పై ధరించే బొట్టుకు, శ్రీమంతం చేసేప్పుడు చేతికే తొడిగే గాజులకు… చాలా లాజిక్కులున్నాయ్. మన పెద్దోళ్లున్నారే ఏ పని చేసినా ఊరికే చేయారు. దానికి ఫర్ ఫెక్ట్ మీనింగ్ ఉంటది. కానీ మనం అర్థం చేసుకుంటేనే బోధపడుతుంది.