త్రిపురాంతకం కోట:
ఇది పుత్తూరుకు 26 మైళ్ళ దూరంలో గలదు. ద్వాపర యుగంలో ఇచ్చట కృష్ణుడు పశువులు మేపినట్లు స్థానికులు చెబుతారు. ఇచ్చట కోట శిథిలాలు కలవు. వైష్ణవ పంచరాత్ర సంప్రదాయం ప్రకారం పాలెగార్లు సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించి, ఆలయానికి ముందు పుష్కరణి త్రవ్వించారు. ప్రతిరోజు ఆరు సార్లు ఆరాధనకు, ఉత్సవాలకు వారు మాన్యలు ఇచ్చారు. ఈ మాన్యాలను అనుభవిస్తూ వైష్ణవ పండితులు హైందవాన్ని ప్రచారం చేసేవారు. పసలి 136లో ఈ ఆలయం నిర్మించినట్లు శాసనం గలదు. ఈ ఆలయంలో 5 రాతి విగ్రహాలు, ఒక దారు విగ్రహం, 10 రాగి విగ్రహాలు గలవు. అవి: రెండు సంతాన గోపాలకృష్ణ విగ్రహాలు, 4 ఉభయ నాచియార్లు, కోదండ రామస్వామి, లక్ష్మమ, ఆండాలు, రాజ్యలక్ష్మి, సీత, చక్రతాళ్వారు, వెంకటేశ్వర, రాజ్యలక్ష్మి, గరుడ ఆల్వార్, చిన్నిక్రిష్ణ. గ్రామానికి వెలుపల చెట్టు క్రింద అంకలమ్మ, పొన్నిఅమ్మ విగ్రహాలు గలవు. గంగమ్మ విగ్రహం,