విటమిన్ డి లోపంతో మానసిక సమస్య
విటమిన్ డి లోపించిందో ఒత్తిడి తప్పదంటున్నారు పరిశోధకులు. ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభించే డి విటమిన్ లోపిస్తే మానసిక ఒత్తిడి ఖాయమని ఈ తాజా అధ్యయనంలో తేలింది.
అమెరికాలోని యూని వర్శిటీ ఆఫ్ జార్జియా నిర్వహించిన సర్వేలో సీజనల్ డిప్రెషన్‌కు (సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ - ఎస్.ఎ.డి) కారణం సూర్యరశ్మేనని తేలింది. ఆధునిక జీవనశైలిలో ఎప్పుడూ ఏసీ రూముల్లో ఉండటం, సూర్యరశ్మికి దూరంగా ఉండే ఐటీ హబ్‌లు, కంపూటర్ల ముందు కూర్చునే ఉద్యోగాలు చేయడం... ఇలాంటి వాటివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ స్థితే మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని పరిశోధకులు తేల్చారు. కాబట్టి విటమిన్ డి అనేది మానసిక ఆరోగ్యానికి చాలా అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి, ప్రతి రోజు కొన్ని నిమిషాల పాటు సూర్యోదయం లేదా సూర్యాస్తయం సమయంలో ఆరుబయట సూర్యరశ్మిలో తిరగడం వల్ల విటమిన్ డి శరీరానికి అందుతుంది. తద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.