Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 16 December 2014

HEALTH WITH FRUIT JUICES - TIPS IN TELUGU FOR CHOOSING GOOD FRUIT JUICES FOR GOOD HEALTH


ఏ జ్యూస్‌లో ఏం ఉంది?

*ప్రతిరోజు ఏదైనా తాజా పండ్లు, కూరగాయలతో జ్యూస్‌ చేసుకుని తాగటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏ రసం తీసుకుంటే ఏ ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం.
*బత్తాయి రసం రోజూ తాగటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
యాపిల్‌ రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. 
బొప్పాయి రసం చర్మానికి ఎంతో మంచిది. అజీర్ణ సమస్యలు తలెత్తవు. గాయాలు మానడానికి కూడా ఉపయోగపడుతుంది.
*నిమ్మరసం రోజు తీసుకుంటే ఊబకాయం సమస్య ఉండదు. నీరసం తగ్గుతుంది.
ద్రాక్షరసం రక్తపోటు అదుపులో ఉంచుతుంది. కొవ్వుని తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.
ఉసిరికాయ రసం విటమిన్‌ సి పుష్కలంగా అభిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో చెక్కర స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
టొమాటోరసం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ రసానికి చిటికెడు మిరియాల పొడి చేరిస్తే రుచిగా ఉంటుంది.
*క్యారట్‌ రసం కాలేయానికి ఎంతో మేలు బరువు తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. అల్సర్లు, క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.
*దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది.