Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 17 December 2014

TELUGU ANCIENT CUSTOMS AND TRADITIONS OF USING TURMERIC / PASUPU


కొత్త బట్టలకు నలువైపులా పసుపు ఎందుకు రాస్తారు?

ఈ ఆచారాన్ని మన పూర్వీకులు ఆరోగ్యం కోసం పెట్టారు. బట్టలను మగ్గాలపై నేస్తారు. నేసే ముందు నూలుకు పిండితో తయారయిన గంజి పెడతారు. అలా గంజి పెట్టి నేయటం వల్ల అనేక రోగక్రిములు వస్త్రాల్లో చేరతాయి. అలాంటి వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలొస్తాయి. అందుకే క్రిములను దూరం చేసే పసుపును నలువైపులా రాసి ఆపై ధరించమని చెబుతారు. పసుపు మంగళకరానికి కూడా గుర్తు. అందానికి ప్రతీక . స్త్రీలకు పసుపు కుంకుమే అందము . కావున అందాన్ని ... ఆరోగ్యాన్ని ఇచ్చే పవుపు కొత్త బట్టలకు నాలుగు మూలలా రాస్తారు .