జగమెరిగిన అత్తగారు శ్రీమతి సూర్యకాంతమ్మగారు, డిశంబర్ 17, 1996 న స్వర్గస్థులయారు.
ఈవిడ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమెకనిపించినా, అమెగయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన. సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. హాస్యనటుల పక్కన వేసింది గనక - హాస్యనటి అనిపించుకోవచ్చు. ఐతే ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. ఏమైతేనేం - గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.