Search This Blog

Chodavaramnet Followers

Saturday 8 November 2014

SOME GENERAL KNOWLEDGE FACTS AND FIGURES IN TELUGU

* ఆనియన్‌(ఉల్లిపాయ) అనేది లాటిన్‌ పదం. ఆ పదానికి అర్థం... 'పెద్దముత్యం' అని.

* మానవశరీరంలో ఇతరభాగాలపై ఉన్న వెంట్రుకల కన్నా గడ్డం మీది వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.

* గుర్రాలూ, ఎలుకలూ వాంతి చేసుకోవు.

* మనిషి కాళ్లల్లో 2,50,000 చెమటగ్రంథులు ఉంటాయి.

* ఒక అధ్యయనం ప్రకారం సెలబ్రిటీలతో శృంగారమే అంతర్జాతీయంగా అత్యధికులు కనే కల.

* ఒక గంటసేపు టైపింగ్‌ చేస్తే 110 క్యాలరీలు ఖర్చవుతాయి.

కథల్లోనూ యానిమేషన్‌ చిత్రాల్లోనూ ఉండే కల్పిత పాత్రల మీద వోజుతో ఆయా క్యారెక్టర్ల దుస్తులను ధరించడాన్ని 'కాస్‌ప్లే' అంటారు. దీనికి ఆద్యులు జపనీయులు. కాస్‌ప్లే అంటే కాస్ట్యూమ్‌ప్లే అని అర్థం. ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్లు కాస్‌ప్లే కిందకు రావు.

* శరీరంలో మరే ఇతర భాగంకన్నా నాలుకపైనే అత్యంత సున్నితమైన నరాలుంటాయి.

*అమెరికా తర్వాత సరికొత్త సాఫ్ట్‌వేర్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఐర్లాండ్‌.

*పదిహేడో శతాబ్దం తొలినాళ్లలో థర్మామీటర్‌లో పాదరసానికి బదులు బ్రాందీని పోసేవారట.