Search This Blog

Chodavaramnet Followers

Tuesday 7 October 2014

LORD MAHADEV'S SIVA PURANAM - ARTICLE ABOUT SIVA PURANAM IN TELUGU



శివ పురాణము

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.
శివ పురాణములో 26,000 శ్లోకాలు (మరొక లెక్క) ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు.
విద్యేశ్వర సంహిత లో 25 అధ్యాయాలు ఉంటాయి
రుద్ర సంహిత లో
సృష్టి ఖండము (20 అధ్యాయాలు)
సతీ ఖండము (43అధ్యాయాలు)
పార్వతీ ఖండము (55 అధ్యాయాలు)
కుమార ఖండము (20 అధ్యాయాలు)
యుద్ధ ఖండము (59 అధ్యాయాలు)
శతరుద్ర సంహిత (42 అధ్యాయాలు)
కోటి రుద్ర సంహిత (43 అధ్యాయాలు)
ఉమా సంహిత (51 అధ్యాయాలు)
కైలాస సంహిత (23 అధ్యాయాలు)
వాయివీత సంహిత - ఇది రెండు భాగాలు గా విభజించబడింది 35, 41 అధ్యాయాలు
ప్రతి అధ్యాయములో ను అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడినవి. ఆన్ని పురాణములలోను (మత్స్య పురాణము లో తప్ప) శివ పురాణము గురించి చెప్పబడింది.

శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు
సృష్టి ప్రశంస అజిత
తరణోపాయము
శివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వము
శివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుక
శివుడు హనుమంతుడగుట, అర్జునుడు మరియు కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదము
అంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము
నంది, భృంగుల జన్మ వృత్తాంతము
పరశురామోపాఖ్యానము - కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగజని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము మరియు సహగమనము
పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట, పరశురామ కార్తవీర్యుల యుద్ధము, సుచంద్రుని యుద్ధము
పరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుట
ముక్తి సాధనములు
పిండోత్పత్తి విధానము
బృహస్పత్యోపాఖ్యాణము