పద్య సాహిత్యం » మనుచరిత్ర.లో కొన్ని పద్యాలు........రచన: అల్లసాని పెద్దన.
.
తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం.
ఐతే పెద్దన తన మనుచరిత్రతో తెలుగు సాహిత్యాన్నంతటినీ ఓ మలుపు తిప్పాడు.
.
వాల్మీకి శోకం శ్లోకం ఐతే పెద్దన ఆనందం ప్రబంధమైంది.
సామాజికస్థితిగతులు అసంతృప్తికరంగా ఉన్నప్పుడు, జీవితం దుఃఖభాజనంగా కనిపించినప్పుడు “సాహిత్యప్రయోజనం సమాజశ్రేయస్సే” అన్న దృష్టి సాహితీకారులకు కలగటం చూశాం, ఇప్పుడూ చూస్తున్నాం.
సుఖసంతోషాల్తో సౌభాగ్యంతో ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ఉన్న సమాజపు జీవనదృష్టిని ప్రతిబింబించేవి తొలితరం ప్రబంధాలు. వాటిలో తొలిదీ ఉన్నతమైనదీ ఈ మనుచరిత్ర.
.
వరణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం
బరమై సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై అరుణాస్పదంబనగ ఆర్యావర్తదేశంబునన్
పురమొప్పున్ మహికంఠహార తరళ స్ఫూర్తిన్ విడంబింపుచున్
.
ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై
.
.శీలంబుం కులమున్ శమంబు దమముం చెల్వంబు లేబ్రాయముం
పోలంజూచి ఇతండె పాత్రుడని ఏ భూపాలు డీవచ్చినన్
సాలగ్రామము మున్నుగా కొనడు మాన్యక్షేత్రమున్ పెక్కుచం
దాలం పండు నొకప్పుడుం తరుగ దింటం పాడియుం పంటయున్
.
ముడిచిన యొంటికెంజెడ మూయ మువ్వన్నె
మెగముతోలు కిరీటముగ ధరించి
కకపాల కేదార కటక ముద్రిత పాణి
కురుచ లాతాముతో కూర్చిపట్టి
ఐణేయమైన ఒడ్డాణంబు లవణిచే
నక్కళించిన పొట్టమక్కళించి
ఆరకూటచ్ఛాయ నవఘళింపగ చాలు
బడుగుదేహంబున భస్మమలది
మిట్టయురమున నిడుయోగపట్టె మెరయ
చెవుల రుద్రాక్షపోగులు చవుకళింప
కావికుబుసంబు జలకుండికయును పూని
చేరె తద్గేహ మౌషధసిద్ధు డొకడు
.
మౌనినాథ కుటుంబ జంబాల పటల
మగ్న మాదృశ గృహమేధిమండలంబు
నుద్ధరింపంగ నౌషధమొండు కలదె
యుష్మదంఘ్రిరజో లేశమొకటి తక్క..