Search This Blog

Chodavaramnet Followers

Saturday, 1 June 2013

TIPS TO MAINTAIN EVER GREEN BEAUTINESS AFTER BABY DELIVERY





తల్లి అయిన తరువాత అందాన్ని కాపాడుకోవడం కొంచెం కష్టమైన పనే. 

అందాన్ని కాపాడుకోవడానికి తగిన సమయాన్ని మరియు డబ్బుని చాలా మంది తల్లులు కేటాయించలేరు. ఇంట్లోనే ఉండే తల్లులకి వారి రూపురేఖల్ని తీర్చి దిద్దుకోవడానికి సరిపడా సమయం ఉండదు. బయటికి ఎక్కువగా వెళ్ళే అవసరం ఉండదు కాబట్టి వారు కూడా అందంపైనే ఎక్కువగా శ్రద్ధ కనబరచరు. అటువంటి గృహిణిలు సులభమైన పద్ధతులలో అందంగా కనిపించేందుకు కొన్ని సూచనలు.

 1.పరిశుభ్రతకి తగిన ప్రాధాన్యతనివ్వండి. క్లాసీమామ్‌గా ఉండడానికి ఇది ముఖ్యమైన ప్రాథమిక నియమం. కొత్తగా తల్లి అయిన వారికి ఎన్నో పనులుండడం వల్ల రోజుకొకసారి స్నానం చేయడానికి కూడా సమయం చిక్కదు. కానీ స్నానానికి ప్రాధాన్యత నివ్వండి. స్నానం చేసిన తరువాత మీరు ఎంతో ఉత్తేజం పొందుతారు. తల్లిగా మీరు చేయవలసిన పనులను ఎన్నైనా చాకచక్యంగా త్వరత్వరగా పూర్తి చేయగలుగుతారు. మీ ముఖాన్ని చక్కటి క్లేన్సేర్‌తో కడగండి. షాంపూ చేసి కండీషనర్‌ చేసుకోండి. 

2.మీకు నప్పే సొగసైన హెయిర్‌ స్టైల్‌ని ఎంచుకోండి. గర్భిణీగా ఉన్నప్పటినుండి హెయిర్‌ స్టైల్‌ గురించి పట్టించు కునే తీరిక ఉండదు. సెలూన్‌ కట్‌ మరియు రంగులు ఖరీదైనవి. అంతేకాక ఆ రంగులు మంచివికావు కూడా. తొమ్మిది నెలల తరువాత మారిపోయిన జుట్టుతీరుని తీర్చి దిద్దుకునేందుకు సమయం మరియు డబ్బు అందుబాటు లో ఉండవు. కాబట్టి, మీ హెయిర్‌ స్టైల్‌ని పొందికగా అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఇది అనువైన సమయం. మీకు ఒక వేళ పొట్టి జుట్టు నచ్చితే బాబ్‌ స్టైల్‌ని ప్రయత్నించండి. 

పొడవైన జుట్టు నచ్చితే లాంగ్‌ లేయర్స్‌ని ప్రయత్నించండి. సులభంగా మీకు నచ్చిన హెయిర్‌ స్టైల్‌ కోసం ట్రిం చేయించుకోండి.మీ జుట్టు పొడవుగా ఉన్నట్ట యితే, ఒక వైపు జుట్టుని పోనీ టైల్‌గా కట్టుకుని ఎలాస్టిక్‌ని పెట్టుకోండి. ఈ హెయిర్‌ స్టైల్‌ జిమ్‌ హెయిర్‌ స్టైలే కంటే బెటర్‌గా ఉంటుంది. ఈ హెయిర్‌ స్టైల్‌ సులభంగా చేసుకోవచ్చు.

 ఇంట్లో వేసుకోగలిగే సహజమైన రంగులని మీ జుట్టుకి అప్లై చెయ్యండి. మీ ఐబ్రోస్‌ని వాక్సింగ్‌ చేయించుకోలేకపోతే కనీసం అనవసరపు జుట్టుని తీసివేయడానికి ప్రయత్నించండి.మీ మేకప్‌ని సింపుల్‌గా ఉండేటట్లు చూసుకోండి. తప్ప ఎప్పుడూ మేకప్‌ని స్కిప్‌ చేయవద్దు. సన్‌ స్క్రీన్‌ కలిగిన మోయిశ్చరైజర్‌ని తప్పకుండా వాడండి. మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఐలాషెస్‌ని వంపు తిప్పి మస్కారా అప్లరు చేయండి. మామూలు రోజుల్లో ఐ లైనర్‌ మరియు ఐ షాడో అప్లరు చేసుకోండి.

 పింక్‌ లేదా బ్రౌన్‌ రంగులకి ప్రాధాన్యత నివ్వండి. సాధారణమైన మరియు సులభంగా మైంటైన్‌ చేయగలిగిన బట్టలని ఎంచుకోండి. సులభంగా ఇంట్లోనే ఉతుక్కోగలిగిన స్వెట్టర్స్‌ మరియు కార్డిగన్స్‌ని ఎంచుకోండి. చదునైన నిట్‌ టాప్స్‌ మరియు కాప్రిస్‌లని ఎండాకాలంలో ఉపయోగించేందుకు కొనండి. జీన్స్‌, స్లాక్స్‌ మరియు బాలెట్‌ ఫ్లాట్స్‌కి జతగా వేసుకోవ డానికి తక్కువ హీల్‌ కలిగిన బూట్లని ఎంచుకోండి. వర్కౌట్‌కి వాకింగ్‌కి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాలలో టెన్నిస్‌ షఉష్‌ని వాడడం తగ్గించండి. రోజువారి వాడకానికి సాధారణమైన నగలని ఏర్పాటు చేసుకోండి. 

చిన్న పిల్లలు మెడలో ఉన్న నగలతో, చెవి రింగులతో ఆడడం సర్వసాధా రణం. అలా అని నగలు వాడటాన్ని పూర్తిగా నిర్మూలిం చవద్దు.క్రమం తప్పకుండా మానిక్యుర్‌ మరియు పెడిక్యూర్‌ చేయించుకోండి. రెండు వారాలకొకసారి మీ చేతులు మరియు పాదాలు అందంగా కనిపించడానికి సెలూన్‌కి వెళ్లకపోయినా వీలైనప్పుడల్లా వెళ్ళండి.తగినంత వ్యాయా మం చేయండి. 

మీ పిల్లలని సరదాగా నడకకి తీసుకు వెళ్లడమో లేదా మీ కుటుంబంతో కలిసి డిన్నర్‌ తరువాత సరదాగా నడవడమో చేయండి. ఇంటి దగ్గర చేయగలిగే వ్యాయామాలను తెలుసుకోండి. టీవీలో ఇంట్లో చేయగలిగే సాధారణ వ్యాయామాల గురించి వచ్చిన ప్రోగ్రామ్స్‌ చూసి అవి ప్రయత్నించండి. మీరు మధ్యా హ్నం పూట కునుకు తీసే సమయంలోనే సరిపోయే ఈ వ్యాయామాల వల్ల ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. మీ బేబీ బరువుని కూడా తగ్గించాలనుకుంటే ఆన్‌లైన్‌ కాలరీ కౌంటర్‌లో చేరవచ్చు.

 మీ చిరునవ్వు అందంగా, తెల్లగా ఉండేలా జాగ్రత్త పడండి. క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించండి. ఇంట్లోనే వైట్నింగ్‌ సిస్టంని పాటించండి.ప్రశాంతంగా, వినయంగా ఉం డండి. అలసిపోవడం, ఒత్తిడికి గురవడం వల్ల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు కనబడతాయి. వారానికి ఒక సారైనా బయటికి వెళ్ళండి. సహాయం కోసం మీ లాంటి తల్లుల గ్రూప్‌లో చేరండి. వ్యాయామం మొదలు పెట్టే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించడం చాలా సమయాలలో మేలు చేస్తుంది.