సాధారణంగా ప్రతివారు అలసిపోతుంటారు. కాని లోతుగా పరిశీలిస్తే దీనికి కారణాలు వివిధ రకాలుగా వుంటాయి. వాటిని గుర్తించి ప్రతి ఒక్కరూ తగిన పరిష్కారం పొందాలి. ప్రతిరోజూ పొందే శారీరక అలసటే కాక కొందరు వారి రోజువారీ పనులన్నింటిలోను, సరైన అవగాహన లేక అలసట పొంది ఎన్నో కీళ్ల జబ్బుల వంటి వాటిని కూడా తెచ్చుకుంటారు. అయితే అలసటను ఎదుర్కొనేందుకు వేగమైన పరిష్కారం లేదు. కాని కొద్దిపాటి మంచి అలవాట్లతో ప్రతిరోజూ మీ అలసటను సమర్థవంతంగా ఎదుర్కొనచ్చు. అదెలాగో చూడండి. డైటింగ్ అతిగా చేయకండి. బరువు తగ్గే ప్లానులు, వేగంగా లావుతగ్గాలని చేసే ఆహార నియమాలు వంటివి ఆరోగ్యం కాదు. ఆహారాలన్ని ఒకేసారి మానేయకండి. ఇప్పటికే బరువు తగ్గిన వారైతే, పోయిన మీ బరువును, ఉత్సాహాన్ని పొందేందుకు ఆరోగ్యకరమైన జీవన విధానం మాత్రమే అని గ్రహించండి. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ మానకండి. చాలా మంది ఈ తప్పు పని చేస్తారు. దీనివలన రోజంతా చిరుతిండి తింటారు. ఆకలితో మీ పేగులు అలమటిస్తూంటాయి. కనుక లేచిన మూడు గంటలలోపు ప్రోటీన్లు, పీచు బాగా వుండే బ్రేక్ ఫాస్ట్ తప్పక తీసుకోండి.రక్తహీనత వుందా? పరీక్షించండి. రక్తహీనత మీలో అంతులేని అలసట కలిగిస్తుంది. శరీరంలో ఎర్రరక్తకణాలు బాగా తగ్గిపోయి బలహీనత, శ్వాస సరిగ్గా ఆడకపోవటం కూడా వస్తాయి. ఇది పురుషులకంటే స్త్రీలలో అధికం. అది కూడా వారి రుతుక్రమంలో తగిన ఐరన్ తీసుకోకపోవడంతో వస్తుంది.ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వారానికి కనీసం 4 లేదా 5 సార్లు వ్యాయామం చేయాలి. అది మీలో శక్తిస్థాయిలు పెంచుతుంది. అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. వ్యాయామాలు చేయాలంటే అలసటగా వుంటోందా? కారణాలు పరిశీలించండి. సరిగా తినకపోవడం, తగినంత నీరు తాగకపోవటం, లేదా అధికంగా శారీరక శ్రమ చేయటం కూడా కావచ్చు.అధికంగా తినకండి. అధికంగా తింటే మీ ఎనర్జీ అంతా అది జీర్ణం అవ్వటానికే సరిపోతుంది. మూడుసార్లు అధికంగా తినే బదులు అయిదు సార్లు తక్కువ తక్కువ మొత్తాలు తినండి. బ్లడ్ షుగర్, ఇన్సులిన్ వంటివన్ని నియంత్రించబడతాయి. అలసట దూరం అవుతుంది. ఐరన్ అధికంగా వుండే ఆహారాలు తీసుకోండి.తగినవ్యాయామాలు చేసి మీ కీళ్ళను, ఎకములను సవ్యంగా పనిచేసేలా చేయండి. చేసే వ్యాయామాలు మీకు బలాన్ని మరియు శరీర దృఢత్వాన్ని కలిగించాలి. వ్యాయామాలు తగిన శిక్షణతో చేయండి.మందులు వాడేవారు వాటి సైట్ ఎఫెక్టులు గమనించాలి. నొప్పులకు తరచుగా మాత్రలు వాడకండి. అవి అలసట కలిగిస్తాయి. మందంగా వుండటమనేది వీటివలన కలిగే అలసట లక్షణంగా గుర్తించండి. మీలోని ఒత్తిడిని నియంత్రించుకోండి. అందుకుగాను నిరాశ, విచారం వంటివి భావించకండి. ప్రోత్సాహం, మెమొరీ సమస్యలు లేకుండా చేసుకోండి. లక్ష్యంలేనివారుగా, వ్యర్థ జీవితం అనుకునేవారిగా వుంటే అవి మీ ఆహారంపై ప్రభావం చూపి బలం లేకుండా చేస్తాయి. కనుక ఇటువంటి భావనలు రానీయకండి.