Search This Blog

Chodavaramnet Followers

Monday 1 April 2013

TIPS FOR USE OF PERFUMES




పెర్‌ఫ్యూమ్‌ వాడకం అనేది పూర్వం జమీందారీ కుటుంబాలు, రాజులు మాత్రమే వాడేవారు. కాని నేడు అందరికి ఒక కనీస అవసర వస్తువ్ఞ అయింది. కాని చాలామందికి దీని తయారీ, వాడకంలో జాగ్రత్తలు తెలియవ్ఞ. దీని తయారీలో ఏమేమి వాడతారో, దీనినెలా ఉపయోగించుకోవాలో అవగాహన ఉంటే కొనడంలో, వాడడంలో జాగ్రత్త పడవచ్చు.

సాధారణంగా పెర్‌ఫ్యూమ్స్‌ అనేవి మూడు ప్రధా నమైన రూపాల్లో తయారవుతాయి. మొక్కలు, జంతువులు, రసాయనాలనుంచి తయారు చేస్తుంటారు.


పెర్‌ఫ్యూమ్స్‌ వాడే విధానం

్య ఇంట్లోకి అడుగిడటంతోనే సుమగంధాలు స్వాగతం పలకాలి అంటే ఇంటి ద్వారబంధాలకు పూలమాలలను కట్టి వాటిమీద జాస్మిన్‌ పెర్‌ఫ్యూ మ్‌ను స్ప్రే చేయండి. డైనింగ్‌ టేబుల్‌మీద ఫ్లవర్‌ వాజ్‌లో సహజమైన పూవులను అమర్చి వాటిమీద కూడా స్ప్రే చేస్తే పూవ్ఞలు వాడిపోయినా సువాసన బాగా వస్తుంది. వీటినుంచి వెలువడే సువాసనలు ఇల్లంతా వ్యాపించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
డైనింగ్‌ టేబుల్‌మీద గాని, ఫ్రిజ్‌ మీద గాని మామిడి, జామ వంటి పళ్లను వెదురుబుట్టలో అమర్చండి. వీటినుంచి వెలువడే తీయని వాసన కూడా చక్కని ఫీలింగునిస్తుంది.
మట్టికుండీలలో మొక్కలను పెంచండి. మట్టిని తడిపినప్పుడల్లా మట్టివాసన వెలువడి చిన్న నాటి వర్షపురోజులను గుర్తుకుతెస్తుంది. సాధ్యమైనంత వరకూ రసాయన సెంట్లకు బదు లుగా అరోమాటిక్‌ ఆయిల్స్‌ వాడండి.
పెర్‌ఫ్యూమ్‌ని గాలిలో వెదజల్లి దానిగుండా నడిస్తే శరీరమంతా పల్చగా  పరుచుకుంటుంది.
పొడిచర్మం కలిగినవారు కొంచెం హెచ్చు పెర్‌ఫ్యూ మ్‌ని, జిడ్డు       చర్మం కలిగినవారు కాస్త తక్కువ పెర్‌ఫ్యూమ్‌ని వాడాలి. పెర్‌ఫ్యూమ్‌ స్నిగ్ధంగా ఉండే ఉపరితలం మీద ఎక్కువసేపు నిల్వ ఉంటుంది.
చలికాలం ఇది నెమ్మదిగా వ్యాపిస్తుంది. ఎండాకాలం వేడివల్ల త్వరగా వ్యాపిస్తుంది. అందుకే చలికాలంలో హెచ్చుగాను, ఎండాకాలం తక్కువగాను వాడాలి.
కొత్త పెర్‌ఫ్యూమ్‌ని ఎంపిక చేసుకునేందుకు శాంపిల్‌ని రాసుకుని పదినిముషాలు ఆగాలి. ఉదయం కాకుండా సాయంత్రమైతే ఘ్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. సరైనది ఎంచుకోవచ్చు.
పెర్‌ఫ్యూమ్‌ని మీ చర్మం మీద ప్రయోగించి చూసు కోవాలి. ఒక్కొక్కరి చర్మపు సహజ రసాయనాలు ఒక్కో విధంగా ఉంటాయి. ఇవి పెర్‌ఫ్యూమ్‌ లక్షణాలతో విభేదించకూడదు.
స్నానం చేసిన వెంటనే సుగంధాలను వాడితే మంచిది. ఈ సమయంలో చర్మంపైన రంధ్రాలు తెరుచుకుని ఎక్కువ సుగంధ పదార్థాన్ని గ్రహి స్తాయి.
 పెర్‌ఫ్యూమ్స్‌ని ఆభరణాల మీద ప్రయోగించ కూడదు. వీటిలో ఉండే ఆల్కహాల్‌ ముత్యాలు, వెండి వంటివాటి రంగును మార్చేసే అవకాశం ఉంది.
  ఏడాది పొడుగునా ఒకే విధమైన పెర్‌ఫ్యూమ్‌ వాడకూడదు. రుతువులను బట్టి వీటి తీక్షణత, గుణధర్మాలు మారుతుంటాయి.
తలస్నానం చేసిన తరువాత వెంట్రుకలను తువ్వాలుతో తుడుచుకుని, జుట్టుమీద దీనిని స్ప్రే చేసుకోవచ్చు.
కరెంటు బల్బ్‌ మీద ఒకటిరెండు చుక్కలు సెంటుని అద్ది బల్బుని వెలిగిస్తే, బల్బు విడుదల చేసే వేడికి వాసన గదంతా వ్యాపిస్తుంది.
చర్మం కింద నాడి తగిలే పల్స్‌పాయింట్ల మీద పెర్‌ఫ్యూమ్‌ని ప్రయోగిస్తే, శరీరం విడుదలచేసే పెర్‌ఫ్యూమ్‌ ఆవిరై పరిమళాలను వెద జల్లుతుంది. మెడ వెనుక, చెవుల వెనుక, మోకాళ్ల వెనుక, మణికట్టు- వంటి భాగాలు దీనికి అనువైనవి.
చెక్క బీరువాలు, షెల్ఫ్‌ కింద భాగాల్లో పెర్‌ ఫ్యూమ్‌ని స్ప్రే చేయాలి. చెక్క, సెంటుని గ్రహించి చాలాసేపటి వరకు ఉంచుకుంటుంది.
ఒక బాండ్‌ పేపర్‌మీద పెర్‌ఫ్యూమ్‌ స్ప్రే చేసి బ్రీఫ్‌కేస్‌ అడుగున ఉంచితే అది తెరిచినప్పుడల్లా సుగంధం వ్యాపిస్తుంది.
 వాడిన పెర్‌ఫ్యూమ్‌ సీసాలను డెస్క్‌ డ్రాయర్లలో ఉంచితే అది తెరిచినప్పుడల్లా సువా సనగా అనిపిస్తుంది.
రేడియేటర్‌ వెంట్‌ వద్ద పెర్‌ఫ్యూమ్‌ని అద్దితే వాతావరణం పరిమళభరితంగా అనిపిస్తుంది.