Search This Blog

Chodavaramnet Followers

Saturday, 26 December 2015

HEALTH BENEFITS WITH USING VUSIRIKAYA


ఉసిరి కాయ లో అనేక ఔషధగుణములు వున్నాయి 

ఉసిరి కాయలలో విటమిన్ 'సీ' అధికముగా వున్నది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .

జీర్ణమండలం :
దాహం ,మంట,వాంతులు ,ఆకలిలేకపోవుట ,చిక్కిపోవుట ,ఎనీమియా ,హైపర్ -ఎసిడిటి , మున్నకు జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది .

ఉపిరితిత్తులు :
ఆస్తమా ,బ్రాంకైటిస్ ,క్షయ ,శ్వాసనాలముల వాపు , ఉపిరితిత్తులనుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .

గుండె :
ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది . ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది . శరీరము లో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .

కాలేయము :
కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల తగ్గుతాయి . కాలేయం లో చేరిన మలినాలు , విషపదార్ధాలు ను తొలగిస్తుంది , 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .

కామెర్లు :
ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితె వైటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధి మరియు కామెర్లు రాకుండ సహయపదుతుంది.

మలబద్ధకం:
మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉసిరి కాయ తినడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది

నోటి పూత:
నోటి పూతతో బాధపడేవారికి ఉసిరి కాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అర కప్పు నీటిలో ఉసిరి కాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది.

కంటిచూపు:
ఉసిరి కంటిచూపు మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండ కళ్ళు ఎర్రబడటం మరియు దురదని కూడా తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతి రోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది.