రేగిపళ్ళు అనగానే ప్రతి ఒక్కరికీ తమ బాల్యం రోజులు గుర్తుకొస్తాయి. రేగిపళ్లులో చిట్టిరేగి, పెద్దరేగి, గంగిరేగి ఇలా అనేక రకాలు ఉన్నాయి. అలాంటి రేగిపళ్ళలో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రేగిపళ్ళు జ్యూస్‌లో విటమిన్ ఏ, విటమిన్ సి అధికం. రేగిపండ్లను జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అలాగే తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రేగిపండ్లను రోజుకు 3-6 తినడం వల్ల శరీరంలో రక్తపోటు తగ్గుతుంది. ఈ పండ్ల జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. రేగుపండ్లు తినడం వలన రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. మానసికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. రేగుపండు వ్యాధి నిరోధకశక్తిని పెంచడమే కాకుండా, ఆకలినీ ... ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రముఖపాత్ర వహిస్తుందని పెద్దలు చెపుతుంటారు.
రేగిపండ్ల జ్యూస్ తాగడం వల్ల గుండెపోటు, హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవడమే కాకుండా, బరువు కూడా తగ్గొచ్చు. అనీమియాతో బాధపడుతున్నట్లైతే, రేగిపండ్ల జ్యూస్ తీసుకోవడం వల్ల వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే పొటాషియం ఉంది. కాబట్టి ఒక గ్లాసు రేగి పండ్ల జ్యూస్ త్రాగడం వల్ల, ఇది చర్మానికి మాత్రమే కాదు. శరీరానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అంతేనా తెలుగు పండుగలలో సంక్రాంతిని అతిపెద్ద పండుగ. భోగి... సంక్రాంతి... కనుమ అంటూ మూడు రోజులపాటు జరిగే పండుగ ఇది. 'భోగి' రోజున చిన్న పిల్లలకు భోగిపండ్లు పోయడమనే ఆచారం ఉంది. ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి, చిన్న రేగిపళ్ళు... శెనగలు... చిల్లర డబ్బులు... పూలరేకులు కలిపి భోగిపండ్లు పోస్తుంటారు. రేగుపండ్లలో ఎన్నో దివ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి. రేగుపండ్లు తలపై నుంచి పోయడం వలన, అవి శరీరమంతా తాకుతూ కిందపడతాయి కనుక, చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడతాయి.