Search This Blog

Chodavaramnet Followers

Thursday, 10 August 2017

LORD NARASIMHA SWAMY MANTRAM - PRAYER IN TELUGU


"నృసింహ మంత్రం
ఉగ్రం వీరం మహా విష్ణుం
జ్వలంతం సర్వతో ముఖం,
నృసింహ బీషణం భద్రం,
మృత్యు మృత్యుం నమామ్యహం !
.
నరసింహ స్వామి అపత్కాలములలో రక్షించగల ఏకైక దైవశక్తి అని చెప్పడానికి చారిత్రక ఆదారాలు ఉన్నాయి.
-
శ్రీ ఆది శంకరాచార్యులు సైతం తాను మంటలలో కాలిపోతున్నపుడు తన ఇష్టదైవాన్ని కాక, నరసింహ స్వామినే ప్రార్దించి రక్షణ పొందుతాడు. అలా ఆ సమయంలో చెప్పబడిందే "మమ దేహీ కరావలంబ" స్తోత్రం. అలాగే అన్నమాచార్యులు సైతం ఈ స్వామిని ప్రార్థన చేసియే ఆపదసమయంలో గట్టేక్కాడు.
.
అందుకే ఆపదలు బాపటానికి నరసింహ శక్తికి మించిన శక్తి
"న భూతో న భవిష్యతి".
.
మీరు సంక్లిష్ట పరిస్తితుల్లో ఉన్నప్పుడు మనసులొ నరసింహ స్వామిని తలుచుకొని పైన చెప్పిన మంత్రమును రోజుకు 108 సార్లు జపిస్తూ "నాకు కల్గిన ఆపద నుండి నేను రక్షింపబడతాను "అని నమ్మకంతో ఉన్న యెడల మీరు తప్పక అట్టి సంక్లిష్ట పరిస్తితుల్ని అదిగమించగలరు
..
జై నరసింహ! జై జై నరసింహ!