Search This Blog

Chodavaramnet Followers

Friday, 28 July 2017

DEEPAM - LAKSHMI SWAROOPAM - SRAVANAMASAM FESTIVAL 2017 TELUGU ARTICLES


దీపం ....లక్ష్మి స్వరూపం 
*************************
జ్యోతిని పరబ్రహ్మ. స్వరూపంగా 
ఉపాసించే సంస్కృతి మన భారతీయులకు
మాత్రమే సొంతం ఉభయ సంధ్యలలో ప్రతి
ముంగిట్లో దీపారాధన. విధిగా చేయాలని మన
పెద్దలు చెప్తుంటారు ,

దీపాన్ని శివస్వరూపంగా .... లక్ష్మీ
స్వరూపంగా కూడా భావిస్తూ స్థుతిస్థుంటారు.

చూడోత్తంసిదారు చస్థ్రకలికా చంచచ్చిఖా
భాస్వరో
లీలాదగ్దవిలోల. కామశలభః
అస్తః స్పూర్జదపారమోహతిమిర
ప్రాగ్ర్బర. ముచ్చటైన
శ్చేతస్సద్మని యోగినాం
విజయతే జ్ఞాన. ప్రదీపో హరః !!

శివుని దీపజ్యోతిగా భావించి చేసిన. స్తుతి
ఇది , ఈ. జ్యోతి శిరస్సుపై చంద్రుడు శిఖగా
ప్రకాశిస్తున్నాడు , ఈ. జ్యోతి మన్మథుడనే
మిడతిని దగ్ధం చేసింది , శుభకరమైన
వత్తి కొనచే ప్రకాశిస్తోంది ...

మన. అంతంకరణంలో ఉండే , జన్మ
జన్మార్జితమైన. మోహాంధకారపు భారాన్ని
పోగొడుతోంది , యోగుల. హృదయ. గృహాలలో వెలుగుతున్న. జ్ఞాన ప్రకాశమైన
" శివుడు " అనే జ్యోతికి విజయమగుగాక. !!
అనగా ఈ. శివజ్యోతి ఆర్యులలో
ప్రస్పుటంగా ప్రకాశించుగాక. ! ......

ఇంత. చక్కగా జ్యోతిర్లింగ. స్వరూపుడైన
శివుని తేజోమయమూర్తిని " దీపజ్యోతి " గా.
దర్షించి ఈ. శ్లోకాన్ని రచించిన. కవి --
" భర్తృహరి " ఆయన. సుభాషితాలలోని
" వైరాగ్య శతకం " " మంగళాచరణం " గా
ఈ. శ్లోకంతో ప్రారంభమయ్యింది ..

ఈ. స్తుతి దీపారాధన. యొక్క. ప్రాచీనతను .
వైశిష్థ్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు
వివరిస్తుంది . దీపారాధన. మన. హైందవ
ఆచార. ధర్మాలలో ఒక. భాగం --
మాత్రమేకాదు . అది ప్రధానమైనదికూడా ...
దీపం యొక్క. గొప్పతనాన్ని మన
పూర్వీకులు ఏనాడో గమనించారు
కనుకనే దానిని మనం ప్రతినిత్యం
ఆరాదించాలని కొన్ని విధివిధానాలను
మనకు సూచించారు ....

దీపం ఎప్పుడు వెలిగించాలి ?
???????????????????????

ఉభయ. సంధ్యల్లో దీపారాధన. చేయాలని
మన. పెద్దలు చెప్తారు ..
అంటే ప్రాతఃకాలంలోనూ ....
సంధ్యా సమయంలోనూ దీపారాధన
చేయాలి

సూర్యోదయం అయిన. తరువాత. ఒక
ముహూర్తకాలంలోపు అంటే 48. ని || ల
కాలంలోపుగా దీపారాధన. చేయడం
ఉత్తమం ..
అలాగే సూర్యాస్తమయ. కాలం తర్వాత
ఒక ముహూర్తకాలంలోపుగా దీపారాధన
చేయడం ఉత్తమం ..
కాలాతీతమైన. తర్వాత. చేసే దీపారాధన
ఏ. ఫలితం ఇవ్వదని శ్రాస్త్రం
మిట్ట. మధ్యాహ్నం వేళ. దీపారాధన
చేయరాదంటారు. ఇది నిత్య దీపారాధనకు
మాత్రమే పండుగలు పర్వదినాలు .
సుముహూర్తాన. చేసే శుభకార్యాలు .
పుణ్యక్షేత్రతీర్థాలలో చేసే దీపారాధనలకు
వర్తించదు
అలాగే ప్రత్యేక. సందర్భాలలో చేసే --
నోములు వ్రతాలు పూజలు వంటి వాటికి
కూడా ఈ. నియమం వర్తించదు ..

నిత్యపూజకు .....
సింహద్వారం ముందు .... పెరటిలో
తులసికోట. ముందు చేసే దీపారాధన
మాత్రం ఉభయ సంధ్యలో ఈ. విధంగా
చేయటం ఉత్తమోత్తమమని శాస్త్రసారం