Search This Blog

Chodavaramnet Followers

Friday, 10 February 2017

FULL TELUGU SCRIPT OF 183 SLOKAS OF SRI LALITHA SAHASRANAMA STHOTRAM


లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం.

మనసుతో పలకాలి:

లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి.

భవానీమాతే లలితాదేవి:

ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమ మయ చూపులు కలిగిన పాశము, అంకు శం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామం త్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటు వంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలను కుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అను మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం.
183 శ్లోకములలో చెప్పబడినది:

ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి.మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండసమ్భూతా దేవకార్యసముద్యతా 1

ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా 2

మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా 3

చంపకాశోకపున్నాగ సౌగన్ధిక లసత్కచా
కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా 4

అష్టమీ చంద్రవిభ్రాజా దళికస్థలశోభితా
ముఖచన్ద్రకళంకాభ మృగనాభివిశేషికా 5

వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా 6

నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా
తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసురా 7

కదంబమంజరీ క్లుప్త కర్ణపూరమనోహరా
తాటంకయుగళీభూత తపనోడుప మండలా 8

పద్మ రాగశిలాదర్శ పరిభావికపోలభూః
నవవిద్రుమబింబ శ్రీః న్యక్కారిదశనచ్ఛదా 9

శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా
కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా 10

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ
మందస్మిత ప్రభాపూర మజ్జత్కాశమానసా 11

అనాకలితసాదృశ్య చుబుక శ్రీ విరాజితా
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా 12

కనకాంగద కేయూర కమనీయభుజాన్వితా
రత్నగ్రైవేయచింతాక లోల ముక్తాఫలాన్వితా 13

కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫణస్తనీ
నాభ్యాలవాలరోమాళి లతాఫలకుచద్వయీ 14

లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా
స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా 15

అరుణారుణకౌస్తుంభ వస్త్ర భాస్వత్కటీతటీ
రత్నకింకిణికారమ్య రశనా దామభూషితా 16

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా 17

ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘికా
గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా 18

నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా 19

శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా
మరాళీ మందగమనా మహాలావణ్య శేవధిః 20

సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా 21

సుమేరు శృంగమధ్యస్థా శ్రీమన్నగరనాయికా
చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా 22

మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ
సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ 23

దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మవైభవా
భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్వితా 24

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటిభిరావృతా 25

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
గేయచక్రరథారూఢ మంత్రిణీపరిసేవితా 26

కిరిచక్రరథారూఢ దండనాథపురస్కృతా
జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమధ్యగా 27

భండసైన్యవధోద్యుక్త శక్తివిక్రమహర్షితా
నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా 28
భండపుత్రవధోద్యుక్త బాలావిక్రమనందితా
మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషితా 29

విశుక్ర ప్రాణహరణా వారాహీ వీర్యనందితా
కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా 30

మహాగణేశనిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
భండాసురేంద్రనిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ 31

కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాஉసుర సైనికా 32

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధా సభండాసుర శూన్యకా
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా 33

హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః
శ్రీ మద్వాగ్భవకూటైకస్వరూప ముఖపంకజా 34

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ
శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ 35

మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా
కుళామృతైకరసికా కుళసంకేత పాలినీ 36

కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కులయోగినీ
అకుళా సమయాంతస్థా సమయాచార తత్పరా 37

మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదినీ 38

ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ
సహస్రారాంబుజా రూఢా సుధాసారాభివర్షిణీ 39

తటిల్లతా సమరుచి ష్షట్చక్రోపరి సంస్థితా
మాహాసిక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ 40

భవానీ భావనాஉగమ్యా భవారణ్య కుఠారికా
భద్రప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్యదాయినీ 41

భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ 42

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్ర నిభాననా
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా 43

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా 44

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా 45

నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వరా
నీరాగారాగమథనీ నిర్మదా మదనాశినీ 46

నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ 47

నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ 48

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా 49

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా 50

దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జితా
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా 51

సర్వశక్తిమయీ సర్వ మంగళా సద్గతి ప్రదా
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణీ 52

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మృడప్రియా 53

మహారూపా మహాపూజ్యా మహాపాతక నాశినీ
మహామాయా మహాసత్త్వా మహాశక్తిర్మహారతిః 54

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా
మహాబుద్ధి ర్మహాసిద్ది ర్మహాయోగేశ్వరేశ్వరీ 55

మహాతంత్ర మహామంత్రా మహాయంత్రా మహాసనా
మహాయాగ క్రమారాధ్యా మహాభైరవ పూజితా 56

మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ
మహాకామేశ మహిషీ మహాత్రిపుర సుందరీ 57

చతుష్టష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టి కళామయీ
మహాచతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా 58
మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా
చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా 59

చరాஉచర జగన్నాథా చక్రరాజ నికేతనా
పార్వతీ పద్మనయనా పద్మరాగ సమప్రభా 60

పంచపేతాసనాసీనా పంచబ్రహ్మ స్వరూపిణీ
చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణీ 61

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జితా
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా 62

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ 63

సంహారిణీ రుద్ర రూపా తిరోధానకరీశ్వరీ
సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా 64

భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ
పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ 65

ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః
సహస్రశీర్ష వదనా సహస్రాక్షీ సహస్రపాత్ 66

ఆబ్రహ్మ కీటజననీ వర్ణాశ్రమ విధాయినీ
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్య ఫలప్రదా 67

శ్రుతి సీమంత సిందూరీ కృత పాదాబ్జధూళికా
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తిక 68

పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ
అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా 69

నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా 70

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా 71

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణ లంపటా 72

కామ్యా కాలారూపా కదంబకుసుమప్రియా
కల్యాణీ జగతీకందా కరుణారస సాగరా 73

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా
వరదా వామనయనా వారుణీమద విహ్వలా 74

విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసినీ
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ 75

క్షేత్ర స్వరూపా క్షేత్రేశీ క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాల సమర్చిత 76

విజయా విమలా వన్ద్యా వందారుజనవత్సలా
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమణ్డల వాసినీ 77

భక్తి మత్కల్ప లతికా పశుపాశ విమోచనీ
సంహృతాశేష పాషాండా సదాచార ప్రవర్తికా 78

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లదన చంద్రికా
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా 79

చితిస్తత్పద లక్ష్యార్థా చిదేక రసరూపిణీ
స్వాత్మానందలవీభూతా బ్రహ్మాద్యానంద సంతతిః 80

పరా ప్రత్యక్చిదా రూపా పశ్యంతీ పరదేవతా
మధ్యమా వైఖరీ రూపా భక్తమానస హంసికా 81

కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా
శృంగార రససంపూర్ణా జయాజాలంధరస్థితా 82

ఓడ్యానపీఠనిలయా బిందుమండల వాసినీ
రహోయాగ క్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా 83

సద్యః ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా
షడంగదేవతా యుక్త షాడ్గుణ్య పరిపూరితా 84

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ
నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్థ శరీరిణీ 85

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ
మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తాஉవ్యక్త స్వరూపిణీ 86

వ్యాపినీ వివిధాకారా విద్యాஉవిద్యా స్వరూపిణీ
మహాకామేశ నయన కుముదాహ్లాద కౌమదీ 87

భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతిః
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ 88

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా
అప్రమేయా స్వప్రకాశా మనో వాచామగోచరా 89

చిచ్ఛక్తి శ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా
గాయత్త్రి వ్యాహృతి స్సంధ్యా ద్విజబృందనిషేవితా 90

తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా
నిస్సీమమహిమా నిత్య యౌవనా మదశాలినీ 91

మదఘూర్ణిత రక్తాక్షీ మదపాటలగండభూః
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమ ప్రియా 92

కుశలా కోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ
కులకుండాలయా కౌళమార్గతత్పర సేవితా 93

కుమారగణనాథాంబా తుష్ఠిః పుష్టిర్మతి ర్ధృతిః
శాంతి స్స్వస్తిమతీ కాంతి ర్నందినీ విఘ్ననాశినీ 94

తేజోవతీ త్త్రినయనా లోలాక్షీ కామరూపిణీ
మాలినీ హంసినీ మాతా మలయాచల వాసినీ 95

సుముఖీ నళినీ సుభ్రూ శోభనా సురనాయికా
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ 96

వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జితా
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ 97

విశుద్ధచక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనీ
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా 98

పాయసాన్న ప్రియా త్వక్‍స్థా పశులోకభయంకరీ
అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ 99

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాది ధరా రుధిర సంస్థితా 100

కాళరాత్ర్యాది శక్తౌఘ వృతా స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ 101

మణిపూరాబ్జ నిలయా వదనత్త్రయ సంయుతా
వజ్రాధికాయుధోపేతా డామర్యాదిభిరావృతా 102

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీతమానసా
సమస్త భక్తసుఖదా లాకిన్యంబా స్వరూపిణీ 103

స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా
శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్వితా 104

మేదోనిష్టా మధుప్రితా బందిన్యాది సమన్వితా
దధ్యాన్నాసక్తహృదయా డాకినీ రూపధారిణీ 105

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా 106

ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యాంబా స్వరూపిణీ
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా 107

మజ్జాసంస్థా హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా
హరిద్రాన్నైక రసికా హాకినీరూప ధారిణీ 108

సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా
సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వరోముఖీ 109

సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ
స్వాహా స్వధామతిర్మేథా శ్రుతిఃస్మృతి రనుత్తమా 110

పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తనా
పులోమజార్చితా బంధ మోచనీ బంధురాలకా 111

విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః
సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ 112

అగ్రగణ్యాஉచింత్యరూపా కలికల్మష నాశినీ
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్ష నిషేవితా 113

తాంబూల పూరితముఖీ దాడిమీ కుసుమప్రభా
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ 114

నిత్యతృప్తా భక్తనిధి ర్నియంత్రీ నిఖిలేశ్వరీ
మైత్య్రాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ 115

పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞాన ఘనరూపిణీ
మాధ్వీపాలనాలసా మత్తా మాతృకావర్ణ రూపిణీ 116

మహాకైలాసనిలయా మృణాళ మృదుదోర్లతా
మహనీయ దయామూర్తి ర్మహా సామ్రాజ్యశాలినీ 117

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా
శ్రీ షోడశాక్షరీవిద్యా త్రికూట కామకోటికా 118

కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితా
శిరః స్థితా చంద్రనిభా ఫాలస్థేంద్ర ధనుః ప్రభా 119

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశినీ 120

ధరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ
గురుమూర్తి ర్గుణనిధి ర్గోమాతా గుహజన్మభూః 121

దేవేశీ దండనీతిస్థా దహరాకాశ రూపిణీ
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండలపూజితా 122

కళాత్మికా కళానాథా కావ్యాలాప వినోదినీ
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా 123

ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతిః
అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్యవిగ్రహా 124

క్లీంకారి కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ 125

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూర తిలకాంచితా
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా 126

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ
ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహా 127

సర్వవేదాంత సంవేద్యా సత్యానంద స్వరూపిణీ
లోపాముద్రార్చితా లీలాక్లుప్త బ్రహ్మాండమండలా 128

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా 129

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ 130

అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయినీ
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతాద్వైత వర్జితా 131

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్యైక్య స్వరూపిణీ
బృహతీ బ్రహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా 132

భాషా రూపా బృహత్సేనా భావాభావవివర్జితా
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః 133

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా
రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితః 134

రాజ్యలక్ష్మీ కోశనాథా చతురంగబలేశ్వరీ
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా 135

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరి
సర్వార్ధ దాత్రీ సావిత్రీ సచ్ఛిదానందరూపిణీ 136

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ 137 

సర్వోపాధి వినిర్ముక్తా సదాశివ పతివ్రతా
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణీ 138

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా 139

స్వత్రంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తి రూపిణీ
సనకాది సమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ 140

చిత్కళానందకలికా ప్రేమరూపా ప్రియంకరీ
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ 141

మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాది వందితా 142

భవదావ సుధావృష్టిః పాపారణ్య దవానలా
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంత రవిప్రభా 143

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా
రోగపర్వతదంభోళిర్మృత్యుదారు కుఠారికా 144

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా
అపర్ణా చండికా చండ ముండాసుర నిషూదినీ 145
క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ
త్రివర్గదాత్రీ సుభగా త్య్రంబికా త్త్రిగుణాత్మికా 146

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పా నిభాకృతిః
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా 147

దురారాధ్యా దురాదర్షా పాటలీ కుసుమప్రియా
మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా 148

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ 149

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీ న్యస్తరాజ్యధూః
త్రిపురేశీ జయత్సేనానిస్త్రైగుణ్యా పరాపరా 150

సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణా
కపర్దినీ కలామాలా కామధు క్కామరూపిణీ 151

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవధిః
పుష్టాపురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా 152

పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదినీ 153

మూర్తాஉమూర్తా నిత్యతృప్తా మునిమానస హంసికా
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ 154

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా
ప్రసవిత్రీ ప్రచండాஉజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః 155

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః 156

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ
భావజ్ఞా భవరీగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ 157

ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ
ఉదారకీర్తి రుద్దామ వైభవా వర్ణరూపిణీ 158

జన్మమృత్యు జరాతప్త జనవిశ్రాంతి దాయినీ
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీత కళాత్మికా 159

గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా
కల్పనారజితా కాష్ఠాஉకాంతా కాంతార్ధవిగ్రహా 160

కార్యకారణ నిర్ముక్తా కామకేళితరంగితా
కనత్కనక తాటంకా లీలావిగ్రా ధారిణీ 161

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ
అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా 162

త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాకృతిః 163

సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణీ 164

ధర్మాధారా ధనాధ్యక్షా ధన ధాన్య వివర్ధినీ
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణ కారిణీ 165
విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ
అయోనిర్యోని నిలయా కూటస్థా కులరూపిణీ 166

వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా 167

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్దస్వరూపిణీ
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ 168

సవ్యాపసవ్య మార్గస్థా సర్వాప ద్వినివారిణీ
స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర సమర్చితా 169

చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్యకుసుమప్రియా
సదోదితా సదాతుష్టా తరుణాదిత్య పాటలా 170

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా
కౌళినీ కేవలాஉనర్ఘ్య కైవల్య పదదాయినీ 171

స్తోత్రప్రియా స్తుతుమతీ శృతిసంస్తుత వైభవా
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః 172

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ 173

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ
పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధిశాయినీ 174

పంచమీ పంచభూతేశీ పంచసంఖోపచారిణీ
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ 175

ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా 176

బంధూక కుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ 177

సువాసిన్యర్చనప్రీతా శోభనా శుద్ధమనసా
బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా 178

దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రివశంకరీ
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ 179

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా
అనఘాద్భుతచారిత్రా వాంఛితార్ధ ప్రదాయినీ 180

అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీత రూపిణీ
అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానధ్వాంత దీపికా 181

ఆబాల గోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ 182

శ్రీ శివా శివశక్యైక్య రూపిణీ లలితాంబికా
ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సాహస్రకం జగుః 183