Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 20 December 2016

WHITE ONION WITH MILK DRINKING HEALTH BENEFITS


వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రిపూట తాగితే...

వెల్లుల్లి, ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి, ఉల్లిపాయలు ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు. వీటిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో విటమిన్లు, ఐయోడిన్ వంటివి ఉన్నాయి. 

100 గ్రాముల వెల్లుల్లిలో నీటి శాతం 62 శాతం ఉండగా, కార్బొహైడ్రేట్స్ 29.9 శాతం, ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, ధాతువులు 1.0 శాతం, పీచు పదార్థం 0.8 శాతం ఉంటుంది. ఇంకా కాల్షియం 30 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 310 మి.గ్రాములు, ఐరన్ శక్తి 1.3 మి.గ్రాములు, విటమిన్ సీ 13 మిల్లీ గ్రాములు, బి విటమిన్ కూడా ఇందులో ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెల్లుల్లిలోని వాసనకు కారణం అందులోని సల్ఫరే. వెల్లుల్లిలో నీటి ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, సైనస్‌ను నివారిస్తుంది. టీబీతో బాధపడే వారు ఒక గ్లాసు పాలతో ఒక గ్లాసు నీరు, పది మిరియాలు, కొంచెం పసుపు పొడి, ఒక వెల్లుల్లి బెరడును వేసి కాసేపు వేడి చేసి దానిని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రి పూట తీసుకుంటే జలుబు, దగ్గు, వాతం వంటి వ్యాధులన్నీ నయం అవుతాయి. ఈ పాలు తాగి జలుబు తగ్గిపోతే రెండు పూటల తాగడాన్ని ఆపేయాలి. అలాగే ఈ పాలను ఆస్తమా వ్యాధిగ్రస్తులు సేవిస్తే శ్వాసప్రక్రియ సక్రమమవుతుంది.

అలాగే వెల్లుల్లి మనం తీసుకునే ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు, వైరస్ వంటివి తొలగిపోతాయి. ఇంకా రక్త కణాలను వెల్లుల్లి శుభ్రపరుస్తుందని, అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

దీంతో మన శరీరానికి తగిన ఆక్సిజన్ లభించడంతో ఒత్తిడి మాయమవడంతో పాటు నరాల పనీతీరు, శ్వాసప్రక్రియ క్రమమవుతుంది. క్యాన్సర్‌తో బాధపడేవారు మందులతో పాటు పూర్తి వెల్లుల్లిని ఉడికించి రోజూ తీసుకుంటే క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చును. అలాగే మొటిమలపై వెల్లుల్లి రసాన్ని రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. నరాల బలహీనతకు వెల్లుల్లి బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.