Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 13 December 2016

THAVA PANEER SANKRANTHI FESTIVAL TELUGU RECIPE


తవా పనీర్‌

కావల్సినవి: పనీర్‌ ముక్కలు - కప్పు, కసూరీ మేథీ - చెంచా, కారం- చెంచా, పసుపు- పావుచెంచా, ఉప్పు- రుచికి తగినంత, నూనె- పావుకప్పు, జీలకర్ర- అరచెంచా, సోంపు - అర చెంచా, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, అల్లం ముద్ద- రెండు చెంచాలు, పచ్చిమిర్చి తరుగు- చెంచా, ధనియాలపొడి- చెంచా, టొమాటో గుజ్జు- చెంచా, షాజీరా- అరచెంచా, తాజా క్రీం- రెండు చెంచాలు, గరంమసాలా- అరచెంచా

తయారీ: పనీర్‌ ముక్కల్ని విడిగా గిన్నెలోకి తీసుకుని అందులో పసుపు, కారం, కసూరీ మేథీ, ఉప్పు వేసి అన్నిటింటినీ కలిపి మూత పెట్టాలి. ఇరవై నిమిషాల తరవాత పొయ్యి మీద పెనం పెట్టి అందులో మూడు చెంచాల నూనె వేయాలి. వేడయ్యాక పనీర్‌ ముక్కల్ని వేయించి పక్కన పెట్టాలి. తరవాత అదే పెనంపై మిగిలిన నూనె వేడిచేసి జీలకర్ర, సోంపు, షాజీరా వేయించాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలూ, అల్లం ముద్దా, పచ్చిమిర్చి, ధనియాలపొడీ, కొద్దిగా ఉప్పు వేయాలి. కాసేపయ్యాక టొమాటో గుజ్జు వేసి మూత పెట్టాలి. ఇది కూరలా అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు, క్రీం, గరం మసాలా వేసి సన్న మంటపై ఉంచాలి. మూడు నిమిషాల తరవాత దింపేయాలి. ఇది చపాతీలోకే కాదు, అన్నంలోకీ బాగుంటుంది.