Search This Blog

Chodavaramnet Followers

Tuesday 13 December 2016

THAVA PALAV TELUGU RECIPE


 తవా పలావ్‌

కావల్సినవి: అన్నం- మూడు కప్పులు, టొమాటో తరుగు- కప్పు, నూనె- రెండు చెంచాలు, జీలకర్ర- చెంచా, ఉల్లిపాయ తరుగు- కప్పు, అల్లంముద్ద- చెంచా, వెల్లుల్లి ముద్ద - చెంచా, ఉడికించిన బఠాణీలు- అరకప్పు, ఉడికించిన క్యారెట్‌- ఒకటి, పావ్‌బాజీ మసాలా- రెండు చెంచాలు, కారం- చెంచా, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- రుచికి సరిపడా, క్యాప్సికం తరుగు- పావుకప్పు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు

తయారీ: పెనాన్ని పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాక నూనె వేసి, జీలకర్ర వేయించాలి. కాసేపయ్యాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్దా, టొమాటో తరుగు వేయాలి. ఇవన్నీ వేగాక ఉడికించిన బఠాణీలు, క్యారెట్‌ తరుగు, పావ్‌బాజీ మసాలా, కారం, పచ్చిమిర్చి ముద్దా, కాసిని నీళ్లు చేర్చి మూత పెట్టాలి. మూడు నిమిషాలయ్యాక అన్నం, ఉప్పు, క్యాప్సికం తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం కలపాలి. బాగా వేయించి దింపేయాలి.