Search This Blog

Chodavaramnet Followers

Sunday 25 December 2016

SUPER 20 CARROT FRUIT HEALTH TIPS IN TELUGU


క్యారెట్ -20 ఉపయోగాలు

క్యారెట్ ,కూరగాయలన్నింటిలో తీయటిది. ఈ క్యారేట్లోనున్న గుణాలు మరెందులోనూ ఉండవంతున్నారు వైద్యులు. సాధారనంగా క్యారెట్తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతం మంది ఇష్టపడతారు. మరి కొంతమంది క్యారెట్ ను పచ్చి గ తినేందుకు ఇస్తాపదతరే కానీ వండితే మాత్రం ఇష్టపడేవారు తక్కువ. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మనిసికంగా ఎదిగేలా చేయడమే కాకా మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినని వారి కోసం క్యారట్లను సలాడ్ల లాగ, జ్యూస్ ల రూపంలోనూ తీసుకోవచ్చుననీ ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యం గల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మన శరీరానికి అత్యంత ముక్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ బి. సి, జి లను ఇస్తో శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మంగినీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, బాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తోంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం చక్కటి సమతౌల్యాన్ని అద్బుతంగా ఇది ఇవ్వగలదు. ఇది మంచి పటిష్టమైన పల్లకూ ఎముకలకు మంచి చర్మానికి కవలసిన అత్యావస్యకమైన పదార్థం.అంతే కాదు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

చర్మానికి క్యారెట్ ఎంతో ఉపయోగం
ఎండకు కలిమి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారట్ రసం చాల బాగా ఉపయోగపడుతుంది, రంగును పెంచాతమేకాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం తోడ్పడుతుంది. శరీరంలోని మృతకణాలను తిరిగి ఆక్టివేట్ చేయడం వాళ్ళ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పొసుకోవాలంటే క్యారట్ జ్యూస్ తప్పక సేవించాలి.

జుట్టు పెరగాలంటే ??
తాజా క్యారెట్ జ్యుస్ కు కొంచెం నీళ్ళు, పుల్ల పెరుగు, గుడ్డులో ఉండే తెల్లసొన కలిపి శిరోజాలకు పట్ట్టించి కొద్దిసేయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాకా ,శిరోజాలు గట్టిగ వుంటాయి. వేసవిలో జుట్టు చివర్లు పగిలిపోయినట్లయితే .....క్యారెట్ ఆకులకు కాస్తంత నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరి తలకు పూసుకుని పెసరపిందిని తలకు మర్దన చేసి స్నానం చేసినట్లయితే జుట్టు చివర్లు తెగకుండా, జుట్టు నిగంగాలాడుతూ ఉంటుంది.

కళ్ళకు క్యారెట్ చక్కని మేలు:
క్యారేట్టులో విటమిన్ ఏ, బీ ఈ తో పాటు పలు మినరల్స్ ఉండటం మూలాన కళ్ళల్లో సాధారణంగా ఏర్పడే హ్రస్వ ద్రుష్టి, దూరదృష్టి లోపాలను సరిదిద్దుకోవచ్చు. పైగా కంటి చూపు మేరుగుపడుతుంది.

రుతుక్రమ సమస్యలు
మహిలలో నెలసరి సరిగా రాకపోతే కూడా క్యారెట్ జ్యూస్ క్రమబద్దేకరిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజు ఒక గ్లాస్ క్యారెట్ సేవిన్చాలన్తున్నారు వైద్యులు.