Search This Blog

Chodavaramnet Followers

Sunday 25 December 2016

PURVA JANMA KARMA PHALAM - TELUGU DEVOTIONAL ARTICLE


 పూర్వజన్మ కర్మ ఫలం

ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదు రయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవి తం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదౄఎష్టి పడిందంటే అంతే సంగతులు. 

ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటేఅమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.

ఫలితం అనుభవించాల్సిందే: ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతౄఎగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది.

మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.