Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 21 December 2016

LEGS PAIN OVERCOME TIPS IN TELUGU


కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

కాళ్ళ నొప్పి
కాళ్ళ నొప్పి అనేది చాలా సాధారణ సమస్యగా చెప్పవచ్చు. కాలి వేళ్ళు, మోకాలి ప్రాంతం, మడిమ లేదా పాదం వంటి ఏ ప్రాంతంలో అయిన రావచ్చు. వృద్దాప్యం, అసౌకర్యంగా ఉండే షూ, ఎక్కువ సమయం పాటూ నడవటం లేదా నిలబడటం, మినరల్ లోపం, మధుమేహం మరియు ఇతర ఆరోగ్య పరిస్థితుల వలన కాళ్ళలో నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పులను కొన్ని రకాల గృహ నివారణలు మరియు సహజ పద్దతులు త్వరగా ఉపశమనం అందిస్తాయి. వాటిలో కొన్నిటి గురించి ఇక్కడ తెలుపబడింది.
వెనిగర్
బెణుకులు మరియు గాయాల వలన కలిగే ఇన్ఫ్లమేషన్ ల వలన కలిగే అసౌకర్యాల నుండి వెనిగర్ ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని, రెండు చెంచాల వెనిగర్ ను అందులో కలపండి. దీనితో పాటుగా కొద్దిగా ఎప్సం సాల్ట్ ను కూడా కలపండి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిమిషాల పాటూ కాళ్ళను నానబెట్టండి. ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు

ఎప్సం సాల్ట్
నయం చేసే గుణాలను కలిగి ఉండే ఎప్సం సాల్ట్ కాళ్ళలో కలిగే నొప్పుల నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల ఎప్సం సాల్ట్ ను కలపండి. తరువాత దీనిలో 10 నుండి 15 నిమిషాల పాటూ మీ కాళ్ళను అందులో ఉంచండి. కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే ఉత్పత్తులను పాదాలకు పూయండి. ఎందుకంటే ఎప్సం సాల్ట్ కాళ్ళను పొడిగా మారుస్తుంది.

లవంగాల నూనె
తలనొప్పి, కీళ్ళనొప్పులు, అథ్లెట్ లలో కలిగే కాళ్ళ నొప్పులు, గోళ్లలో కలిగే ఇన్ఫెక్షన్ మరియు కాళ్ళలో కలిగే నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పిగా అనిపించిన వెంటనే లావంగాల నూనెను అప్లై చేయటం వలన తక్షణ ఉపశమనం పొందుతారు. ఈ నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి, కండరాలు విశ్రాంతికి గురవుతాయి. మంచి ఫలితాల కోసం, రోజులో కొన్ని సార్లు లవంగాల నూనెను అప్లై చేయండి.