Search This Blog

Chodavaramnet Followers

Tuesday 20 December 2016

Iodine Deficiency - Symptoms of Iodine Deficiency - Signs, Symptoms, & Solutions for Iodine Deficiency

ఈ లక్షణాలను గమనించారా? అయితే అయోడిన్ లోపంతో బాధపడుతున్నారని అర్థం

అయోడిన్ లోపం వలన హైపోథైరాయిడిజం కలుగుతుంది.
సరైన స్థాయిలో అయోడిన్ తీసుకొని ఎడల మలబద్దకం కలగవచ్చు.
గర్భిణులలో దీని లోపం వలన అబార్షన్ అవవచ్చు.

థైరాయిడ్ గ్రంధి ఎలాంటి సమస్యలు లేకుండా పని చేయుటకు లేదా థైరాయిడ్ గ్రంధి నుండి హార్మోన్లు సరైన స్థాయిలో విడుదల అవ్వాలన్న అయోడిన్ తప్పక అవసరం. శరీరానికి తగు స్థాయిలో అయోడిన్ అందని ఎడల హైపోథైరాయిడిజం కలగవచ్చు.

శరీర జీవక్రియ థైరాయిడ్ గ్రంధి ఉత్పత్తి చేసే హార్మోన్ తో నియంత్రించబడుతుంది. ఈ హార్మోన్ తగు స్థాయిలో విడుదల అవ్వలంటే, అయోడిన్ తప్పక అవసరం. కావున అయోడిన్ లోపం వలన కలిగే లక్షణాల గురించి అవగాహనా కలిగి ఉండటం వలన వెంటనే వైద్యం అందించవచ్చు. అయోడిన్ లోపం వలన బహిర్గతం అయ్యే లక్షణాలగురించి ఇక్కడ తెలుపబడింది.

: పురుషులలో హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఇది కూడా చదవండి :

థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయటానికి అయోడిన్ తప్పక అవసరం. దీని స్థాయిలు ఎక్కువ అయిన మరియు తక్కువ అయిన థైరాయిడ్ సమస్యలు కలుగుతాయి. ఒకవేళ మీ అయోడిన్ లోపానికి గురైతే మాత్రం- థైరాయిడ్ గ్రంధి పెద్దగా మారి, కనతిలాగా మారి కనబడుతుంది. కావున ఇలాంటి లక్షణాలను గమనించిన వెంటనే వైద్యుడిని కలిసి తగిన జాగ్రత్తలను తీసుకోండి.

మలబద్దకం
అయోడిన్ లోపం అనేది చాలా శరీర భాగాలపై ప్రభావం చూపుతుంది. దీని లోపం వలన మలబద్దకం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కానీ, మలబద్దకంతో బాధపడుతుంటే మాత్రం వెంటనే వైద్యుడిని కలవండి. అయోడిన్ అధికంగా గల ఆహార పదార్థాలను తినటం ద్వారా మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు.

అలసట
చాలా తరచుగా అలసట సమస్య ఎదురవుతుంది. కానీ రెగ్యులర్ గా ఈ సమస్య వస్తుందంటే.. మీ శరీరంలో ఐయోడిన్ తక్కువగా ఉందని సంకేతం. కాబట్టి.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి చెక్ చేయించుకోవడం మంచిది.

మానసిక అస్థిరత
అయోడిన్ లోపం వలన తీవ్ర ఒత్తిడితో పాటూ, ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలకు గురవుతారు. ఒకవేళ మానసిక సమస్యలతో బాధపడుతుంటే వంటనే వైద్యుడిని కలవండి. నిజ జీవితంలో మానసిక సమస్యలు సాధారణమే. ఒకవేళ కారణం లేకుండా, మనసిక అస్థిరతలకు గురైతే మాత్రం వెంటనే వైద్యుడిని కలవటం మంచిది.

అబార్షన్
గర్భిణులలో అయోడిన్ లోపం ఏర్పడితే అబార్షన్ కి కారణం అవవచ్చు మరియు గర్భస్థ శిశుమరణం జరగవచ్చు. కావున గర్భవతులు వారు తినే ఆహార పదార్థాలలో అయోడిన్ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.

బరువు పెరగటం
కారణం లేకుండా మీ శరీర బరువు అకస్మాత్తుగా పెరిగిందా? అయితే మీరు అయోడిన్ లోపంతో సతమతం అవుతున్నారని అర్థం. ఇలాంటి లక్షణాన్ని గమనిస్తే వెంటనే వైద్యుడిని కలిసి కారణం తెలుసుకొని, తగిన చికిత్స చేపించుకోండి.

అయోడిన్ లోపంతో బాధపడితే, ఈ మూలకం ఎక్కువగా గల ఆహార పదార్థాలను తినటం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అయోడిన్ ను అధికంగా కలిగి ఉండే కాన్బెర్రీ, పెరుగు, స్ట్రాబెర్రీ, బంగాళదుంప, వంటి ఆహార పదార్థాలను మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి.
థైరాయిడ్ సమస్యలు