తులసి ఆకుల్ని నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే?
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
తులసి ఆకుల్ని నీళ్లల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
తులసి ఆకుల్ని నీళ్లల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
నీళ్లు కాచి చల్లార్చి తాగే అలవాటుంటే... ఆ నీళ్లల్లో కాస్త సోంపు వేసి కాచి, వడగట్టి తాగండి. దాహం తీరడంతో పాటు అజీర్తి సమస్యలూ తొలగిపోతాయి.
రోజూ గోధుమ జావ తాగితే రక్తపోటు(బీపీ) అదుపులో ఉంటుంది.
బాదం నూనె చక్కటి మాయిశ్చరైజర్. క్రమం తప్పకుండా దాంతో మర్దన చేస్తే పొడిచర్మం సున్నితంగా మారుతుంది.
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే పాలు, చేపలు వంటి ఆహారం తీసుకునేవారికి చత్వారం వచ్చే ముప్పు తక్కువ.