ఖర్చు తక్కువ.. పోషకాలెక్కువ..
* అమెరికా, జపాన్, కొరియా, చైనాలతో పోల్చి చూస్తే భారతదేశంలో తలసరి వ్యక్తిగత వ్యయం ఎంతో తక్కువ. కేవలం రూ. 65,000 మాత్రమే. అమెరికాలో తలసరి వ్యక్తిగత వ్యయం ఎంతో తెలుసా.. ఏకంగా 37,000 డాలర్లు.. అంటే పాతిక లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారన్నమాట!
* ఆహారం మీద భారతీయులు ఖర్చు చేస్తున్నది కూడా చాలా తక్కువే. సగటున భారతీయులు రోజుకు ఆహారం కోసం ఖర్చుపెడుతున్నది రూ. 50 మాత్రమే.కాని అమెరికన్లు తింటున్న నిల్వ ఆహారంతో పోలిస్తే మన వంటకాల్లోనే పోషకాలు మెండుగా ఉన్నట్లు తేలడం విశేషం.
* భారతీయుల్లో నిల్వ చేసిన (ప్రాసెస్‌డ్/ ప్యాకేజ్డ్) ఆహారం తీసుకునే అలవాటు చాలా తక్కువ. కొన్ని వూరగాయ పచ్చళ్లు, ఒరుగుల వంటివి తప్ప ఎప్పటికప్పుడు వండుకుని తినడమే మనకున్న అలవాటు. ఇదే ఎంతోమంచిదని, పోషక విలువలతో కూడి ఉంటుందని అసోచామ్ తేల్చింది.
• అమెరికన్లది అంతా నిల్వ తిండే
తయారుచేసి నిల్వ చేసిన ఆహారాన్ని అమెరికన్లు ఎక్కువగా తింటారు. వారు ప్ర¾తిరోజూ తీసుకునే ఆహారంలో మూడింట రెండొంతులు ఇలాంటిదే ఉంటుంది. వీటిలో పోషకాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారనేది వాస్తవమే కాని.. ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం వాటిలో ఉప్పు, చక్కెర, నిల్వ ఉంచే పదార్థాలు కొన్నింటిని ఎక్కువ కలుపుతారు. ఆహారంలో ఉప్పు, చక్కెర వంటివి ఎంత ఎక్కువైతే అంత ప్రమాదకరం అవుతుంది. అలాగే నిల్వవలన పోషక విలువలు క్రమంగా తగ్గిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు సమస్య తలెత్తుతుంది.. అందుకే ఇలాంటి ఆహారాన్ని తీసుకునే సమయంలో దానిపై ఉన్న సమాచారాన్ని తప్పనిసరిగా చదివి అందులో ఏమేం కలిపిందీ తెలుసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
• మనకూ పెరుగుతున్న నిల్వ ఆహారం
* పోషకాల సంగతి ఎలా ఉన్నా.. మారుతున్న జీవన పరిస్థితులు, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లాల్సి రావడం.. చిన్న కుటుంబాల ఏర్పాటు వంటి కారణాల వల్ల మన దేశంలో కూడా క్రమేపీ తయారీకి సిద్ధం చేసి నిల్వ ఉంచే ఆహార వినియోగం పెరుగుతోందని ఈ అధ్యయనంలో తేలింది.
* పిల్లలు, యువత ఇలాంటి తయారీ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు.
* సమీప భవిష్యత్తులో వ్యక్తిగత ఆదాయాలు పెరిగే కొద్దీ తయారుచేసిన (ప్రాసెస్‌డ్) ఆహారం తీసుకోవటం పెరుగుతుందని అంచనా.
* అసోఛామ్ (అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) అంచనా ప్రకారం భారతదేశంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఏటా 30 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. కానీ ఇలాంటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేయదని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.