Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 16 November 2016

NATURAL SKIN CARE WITH MILK PRODUCTS - ORANGE JUICE ETC


సహజ సొగసు కోసం..

ముఖం కాంతితో, తాజాగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి? దానికోసం అప్పుడప్పుడూ మన వంటింట్లో దొరికే పండ్లూ, ఇతర పదార్థాలతోనే కొన్ని పూతలు ప్రయత్నించి చూడండి.

* మూడు చెంచాల పాలమీగడ, రెండు చెంచాల నారింజ రసం, కాస్త సెనగపిండి తీసుకొని బాగా కలపాలి. శుభ్రంగా కడిగి తుడుచుకున్న ముఖానికి దీన్ని పూతలా వేసి ఆరాకా చన్నీళ్లతో కడిగేయాలి. ముఖంపై మురికి పూర్తిగా పోతుంది. పాలమీగడ చర్మానికి తేమనందించి, పొడిబారకుండా చేస్తుంది. నారింజరసం, సెనగపిండి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

* రెండుమూడు యాపిల్‌ ముక్కల్ని సన్నగా తరిగి గుజ్జుగా చేయాలి. అందులో చెంచా పాలపొడీ, నాలుగు చెంచాల పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసుకుని, పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. ఈ పూత వల్ల చర్మంలో పీహెచ్‌ స్థాయిలు పెరుగుతాయి. మచ్చలున్నా తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.

* మూడు చెంచాల పెసరపిండిలో కొద్దిగా పసుపు, రెండు చెంచాల పాలూ, తగినన్ని నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక ముఖంపై గోరువెచ్చని నీళ్లు చల్లుకుంటూ, వలయాకారంలో మర్దన చేస్తూ ఆ పూతను తొలగించాలి. తరవాత చన్నీళ్లతో కడిగేయాలి. చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు పోవడమే కాదు, నిర్జీవంగా ఉన్న చర్మం కళగా మారుతుంది.

* చెంచా చొప్పున నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లు ముఖంపై చల్లుకుని కీరదోస ముక్కతో మృదువుగా రుద్దుకోవాలి. చర్మం మృదువుగా, కోమలంగా తయారవుతుంది.